IPL 2026 Orange Cap: ఒక్క మ్యాచ్ కూడా గెలవని టీం.. కట్‌చేస్తే.. తోపు ప్లేయర్‌గా భారీ రికార్డ్..?

Updated on: Apr 03, 2026 | 5:23 PM

IPL 2026 Orange Cap: సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్ అనంతరం పాయింట్ల పట్టికలో, ఆరెంజ్ క్యాప్ రేసులో కీలక మార్పు చోటుచేసుకుంది. ఈ లిస్టులో ఎవరెవరు పోటీ పడుతున్నారు, అగ్రస్థానంలో ఎవరున్నారో ఓసారి చూద్దాం..

1 / 5
ఐపీఎల్ 2026 సీజన్ ఊపందుకుంటోంది. పాయింట్లు, పరుగులు, వికెట్ల రేసులో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అన్ని జట్లు కనీసం ఒక మ్యాచ్ ఆడగా, కోల్‌కతా, హైదరాబాద్ జట్లు చెరో రెండు మ్యాచ్‌లు ఆడి ఆరెంజ్ క్యాప్ రేసులో ముందంజలో ఉన్నాయి.

2 / 5
ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడికి ఇచ్చే ఆరెంజ్ క్యాప్ రేసులో ప్రస్తుతం కోల్‌కతా నైట్ రైడర్స్ యువ బ్యాట్స్‌మెన్ అంక్రిష్ రఘువంశీ ఉన్నాడు. కోల్‌కతా ఖాతా తెరవడంలో విఫలమై, రెండు మ్యాచ్‌లలోనూ ఓడిపోయినప్పటికీ, రఘువంశీ బ్యాట్ మాత్రం అద్భుతంగా రాణిస్తూనే ఉంది.

3 / 5
SRHతో జరిగిన రెండో మ్యాచ్‌లో 52 పరుగులు చేసిన 21 ఏళ్ల కోల్‌కతా నైట్ రైడర్స్ బ్యాట్స్‌మెన్, నంబర్ వన్ ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా నిలిచాడు.

4 / 5
ఈ టోర్నమెంట్‌లో రఘువంశీకి ఇది వరుసగా రెండో అర్ధశతకం. అతను ఇంతకుముందు ముంబై ఇండియన్స్‌పై 51 పరుగులు చేశాడు. దీంతో రెండు ఇన్నింగ్స్‌లలో అతని మొత్తం పరుగులు 103కి చేరాయి. ఇందులో 12 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి.

5 / 5
ఈ జాబితాలో రెండవ స్థానంలో ఎస్ఆర్‌హెచ్ ప్రస్తుత కెప్టెన్ ఇషాన్ కిషన్ ఉన్నారు. అతను రెండు ఇన్నింగ్స్‌లలో 94 పరుగులు చేశాడు. మూడవ స్థానంలో కూడా ఎస్ఆర్‌హెచ్‌కు చెందిన హెన్రిచ్ క్లాసెన్ ఉన్నారు. అతను రెండు మ్యాచ్‌లలో 83 పరుగులు చేశాడు.

Follow Us