IPL 2025: లక్నో సూపర్‌జెయింట్స్‌లో చేరిన టీమిండియా మాజీ పేసర్..

|

Aug 28, 2024 | 10:59 AM

Zaheer Khan: జహీర్ ఖాన్ టీమ్ ఇండియా తరపున 17 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఈ క్రమంలో 352 బంతులు వేసిన జహీర్ 448 పరుగులు ఇచ్చి 17 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్‌లో 100 మ్యాచ్‌లు ఆడిన ఈ లెఫ్టార్మ్ స్పీడ్‌స్టర్ మొత్తం 102 వికెట్లు పడగొట్టాడు. ఇప్పుడు లక్నో సూపర్ జెయింట్స్ కోసం కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు సిద్ధమయ్యాడు.

1 / 5
లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్‌ఎస్‌జీ) మెంటార్‌గా టీమిండియా మాజీ పేసర్ జహీర్ ఖాన్ ఎంపికయ్యాడు. గతంలో ముంబై ఇండియన్స్ జట్టులో స్టాఫ్ కేటగిరీలో కనిపించిన జహీర్ ఖాన్ ఇప్పుడు కొత్త పోస్టుతో ఐపీఎల్‌లోకి రావడం విశేషం.

2 / 5
2018 నుంచి 2022 వరకు, జహీర్ ఖాన్ ముంబై ఇండియన్స్ (MI) టీమ్ డైరెక్టర్‌గా, ఆ తర్వాత గ్లోబల్ డెవలప్‌మెంట్ హెడ్‌గా పనిచేశారు. ఆ మధ్య ముంబై ఇండియన్స్ జట్టు బౌలింగ్ కోచ్‌గా కూడా కనిపించాడు.

3 / 5
గౌతమ్ గంభీర్ ఖాళీ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ జట్టు మెంటార్‌గా జహీర్ ఖాన్ నియమితులయ్యారు. గంభీర్ ఐపీఎల్ 2022-23లో లక్నో సూపర్‌జెయింట్‌కు మెంటార్‌గా ఉన్నాడు. అయితే 2024లో లక్నో ఫ్రాంచైజీని విడిచిపెట్టిన గంభీర్ కోల్‌కతా నైట్ రైడర్స్‌కు మెంటార్‌గా కనిపించాడు.

4 / 5
జహీర్ ఖాన్‌ను ఎంపిక చేయడం ద్వారా లక్నో సూపర్‌జెయింట్స్ ఫ్రాంచైజీ 2 ఖాళీలను భర్తీ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే మెంటార్‌గా ఎంపికైన జాక్ ఎల్‌ఎస్‌జీ జట్టు బౌలింగ్ కోచ్‌గా కనిపించే అవకాశాలను కొట్టిపారేయలేం. ఎందుకంటే భారత్ ఇప్పటివరకు చూసిన అత్యుత్తమ పేసర్లలో జహీర్ ఖాన్ ఒకరు. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ జట్టుకు బౌలింగ్ కోచ్‌గా పనిచేసిన అనుభవం కూడా ఉంది. తద్వారా మెంటార్‌తో పాటు బౌలింగ్‌ కోచ్‌గా కూడా జహీర్‌ఖాన్‌ పని చేసే అవకాశం ఉంది.

5 / 5
జహీర్ ఖాన్ IPLలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడాడు. మొత్తం 100 మ్యాచ్‌లు ఆడి 102 వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత, అతను ముంబై ఇండియన్స్‌కు కోచింగ్ స్టాఫ్‌గా పనిచేశాడు. ఇప్పుడు అతను ఐపీఎల్ 2025లో మెంటార్ పోస్ట్‌తో కనిపించనున్నాడు.