IPL 2024: టీమిండియా ప్రపంచ రికార్డ్‌ను బ్రేక్ చేసిన బెంగళూరు జట్టు.. అదేంటో తెలుసా?

|

Apr 07, 2024 | 12:59 PM

Most Individual Hundreds in T20 Cricket: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ 2024) 19వ మ్యాచ్‌లో ఆర్‌సీబీ జట్టు స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ అద్భుత సెంచరీ చేశాడు. ఈ సెంచరీతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు టీమిండియా పేరిట ఉన్న ప్రత్యేక ప్రపంచ రికార్డును బద్దలు కొట్టింది. ఇంతకీ ఆ రికార్డు ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం..

1 / 5
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ద్వారా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు టీమిండియా ప్రపంచ రికార్డును బద్దలు కొట్టింది. ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. అది కూడా విరాట్ కోహ్లీ 8వ సెంచరీతో ప్రత్యేకం.

2 / 5
అంటే, టీ20 క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు సాధించిన జట్టుగా ప్రపంచ రికార్డు టీమ్ ఇండియా పేరిట ఉంది. భారత జట్టు మొత్తం 219 టీ20 మ్యాచ్‌లు ఆడింది. ఈక్రమంలో భారత బ్యాటర్లు 17 సెంచరీలు చేశారు. దీని ద్వారా టీ20 క్రికెట్‌లో అత్యధిక సెంచరీ సాధించిన టీమ్‌గా టీమిండియా లెక్కలు మార్చింది.

3 / 5
ఇప్పటివరకు ఈ ప్రపంచ రికార్డును రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు బద్దలు కొట్టింది. టీ20 క్రికెట్‌లో 246 మ్యాచ్‌లు ఆడిన ఆర్‌సీబీ తరపున 18 సెంచరీలు నమోదయ్యాయి. దీని ద్వారా టీ20 క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన జట్టుగా ఆర్సీబీ రికార్డు సృష్టించింది.

4 / 5
విశేషమేమిటంటే.. ఆర్సీబీ తరపున 18 సెంచరీలకుగాను విరాట్ కోహ్లి 8 సెంచరీలు చేశాడు. మనీష్ పాండే (1), క్రిస్ గేల్ (5), ఏబీ డివిలియర్స్ (2), దేవదత్ పడిక్కల్ (1), రజత్ పాటిదార్ (1) కూడా ఆర్‌సీబీ తరపున సెంచరీలు సాధించారు.

5 / 5
ఐపీఎల్‌లో అత్యధిక సెంచరీలు సాధించిన జట్ల జాబితాలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (18) అగ్రస్థానంలో ఉండగా, పంజాబ్ కింగ్స్ (14) తర్వాతి స్థానంలో ఉంది. అలాగే రాజస్థాన్ రాయల్స్ (14) జట్టు మూడో స్థానంలో నిలిచింది.