IPL 2023: పేరుకే ఖరీదైన ప్లేయర్లు..! తొలి మ్కాచ్‌లోనే ఫ్రాంచైజీని నిరాశపరిచిన ‘కోట్ల’ హీరోలు..!

|

Apr 04, 2023 | 7:04 AM

IPL 2023: ఐపీఎల్ సీజన్ 16 కి ముందు జరిగిన మినీవేలంలో.. ఫ్రాంచైజీలు ఒక్కొక్క ఆటగాడి కోసం కోట్ల రూపాయలను వెచ్చించాయి. ఇలా డబ్బులు కుమ్మరించడానికి కారణం ఉంది. కోట్ల రూపాయలు అందుకుంటున్న ఆయా ఆటగాళ్లు మ్యాచ్ స్థితి గతులను మార్చగల శక్తిని కలిగి ఉన్నారు. అది వాస్తవమే. అయితే మినీ వేలంలో కోట్ల రూపాయలు అందుకున్న ఆటగాళ్లు తమ తొలి మ్యాచ్‌లోనే అభిమానులను నిరాశపరిచే ప్రదర్శన చేశారు.

1 / 5
ఐపీఎల్ ప్రారంభానికి ముందే పలు ఫ్రాంచైజీలు తమకు కావాల్సిన ఆటగాళ్లను సొంతం చేసుకోవడానికి కాసుల వర్షం కురిపించాయి. ఆయా ఆటగాళ్లు టోర్నీలో రాణిస్తారని, వారు తమ జట్టుకు ఉపయోగకరంగా ఆటతారని ఫ్రాంచైజీలు కోట్ల రూపాయలను వెచ్చించాయి. కానీ వారు తమ తొలి ఆటలో నిరాశపరిచే ప్రదర్శన చేశారు. మరి ఆ ఆటగాళ్లు ఎవరో ఇప్పుడు చూద్దాం..

2 / 5
కామెరాన్ గ్రీన్: గతేడాది డిసెంబర్‌లో జరిగిన ఐపీఎల్ మినీ వేలంలో ముంబై ఇండియన్స్..  ఆస్ట్రేలియాకు చెందిన కామెరాన్ గ్రీన్ కోసం17.5 కోట్లు వెచ్చించింది. గ్రీన్ తన తుఫాను బ్యాటింగ్, బౌలింగ్‌తో జట్టుకు ఉపయోగపడతాడని అంతా భావించారు. కానీ గ్రీన్ తన తొలి మ్యాచ్‌లో విఫలమయ్యాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన తొలి మ్యాచ్‌లో అతను ముంబై తరఫున 5 పరుగులకే పెవీలియన్ బాట పట్టాడు. అలాగే బౌలింగ్ విషయానికొస్తే వేసిన రెండు ఓవర్లలో 30 పరుగులు సమర్పించుకుని ఒకే ఒక్క వికెట్ తీశాడు. ఫలితంగా గ్రీన్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్న ముంబై 8 వికెట్ల తేడాతో ఆర్‌సీబీ చేతుల్లో ఓడిపోయింది.

3 / 5
హ్యారీ బ్రూక్‌: సన్‌రైజర్స్ హైదరాబాద్ కూడా ఇంగ్లండ్‌కు చెందిన హ్యారీ బ్రూక్‌ను రూ.13.25 కోట్లకు కొనుగోలు చేసింది. అతడిని కలుపుకుని జట్టు బ్యాటింగ్ విభాగాన్ని పటిష్టం చేసేందుకు సన్‌రైజర్స్ ప్రయత్నించారు. కానీ బ్రూక్ తన తొలి మ్యాచ్‌లో 21 బంతుల్లో 13 పరుగులు మాత్రమే చేశాడు. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో హైదరాబాద్‌ 72 పరుగుల తేడాతో ఓడిపోయింది.

4 / 5
బెన్ స్టోక్స్: మరో ఇంగ్లండ్ ఆటగాడు బెన్ స్టోక్స్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ రూ.16.25 కోట్లు వెచ్చించింది. అయితే గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో స్టోక్స్ కేవలం 7 పరుగులు మాత్రమే చేశాడు. అలాగే సోమవారం లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా 8 బంతులకు 8 పరుగులే చేశాడు. ఇక బౌలింగ్‌లో కూడా ఒకే ఓవర్ వేసి 18 పరుగులు ఇచ్చుకున్నాడు.  ఫలితంగా స్ట్రోక్స్ తన రెండు మ్యాచ్‌లలోనూ చెన్నైని నిరాశపరిచాడు.

5 / 5
సామ్ కరణ్‌: ఐపీఎల్‌ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడు సామ్ కరణ్‌ను కూడా పంజాబ్ కింగ్స్‌ని నిరాశపరిచాడని చెప్పుకోవాలి. అతని కోసం పంజాబ్ ఏకంగా 18.5 కోట్ల రూపాయలు వెచ్చించింది. ఐపీఎల్ సీజన్ 16లో కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో కరన్ 17 బంతులకు 26 పరుగులు చేశాడు. అలాగే బౌలింగ్‌లో 3 ఓవర్లు వేసి 38 పరుగులు ఇచ్చి, ఒక వికెట్ తీసుకున్నాడు. అయితే గ్రీన్, స్టోక్స్, బ్రూక్‌లతో పోలిస్తే కరణ్ తొలి మ్యాచ్‌లో మంచి ప్రదర్శన చేశాడని  చెప్పుకోవాలి.