ఐపీఎల్ తోపు బ్యాటర్లు వీరే.. ఒకే జట్టుపై అత్యధిక సెంచరీలు.. లిస్టులో టీమిండియా ప్లేయర్లు.!

|

Apr 19, 2023 | 6:39 PM

ఐపీఎల్ అంటేనే పరుగుల వరదకు కేరాఫ్ అడ్రస్. కొన్ని మ్యాచ్‌లు మినహా.. మిగిలిన అన్నింటిలోనూ బ్యాట్స్‌మెన్లదే హవా. ఇక ఐపీఎల్ చరిత్రలో ఇప్పటికే ఎందరో బ్యాట్స్‌మెన్లు సెంచరీలు చేశారు. మరి ఒకే జట్టులో అత్యధిక శతకాలు బాదేసిన బ్యాటర్లు ఎవరో తెలుసుకుందామా..

1 / 5
ఇప్పటివరకు ఐపీఎల్ చరిత్రలో 77 సెంచరీలు నమోదయ్యాయి. ఇందులో అత్యధికం యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్(6) బ్యాట్ నుంచి వచ్చాయి. అటు ఒక సీజన్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా టీమిండియా రన్ మిషన్ విరాట్ కోహ్లీ నిలిచాడు.

2 / 5
ఐపీఎల్ 2016లో సీజన్‌లో విరాట్ కోహ్లీ విధ్వంసం మాములుగా లేదు. ఆ సమయంలో విరాట్ 16 మ్యాచ్‌లలో 152.03 స్ట్రైక్ రేట్‌తో 973 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు సెంచరీలు ఉన్నాయి. వాటిల్లో రెండు.. గుజరాత్ లయన్స్‌పై నమోదయ్యాయి.

3 / 5
ఐపీఎల్ చరిత్రలో బెస్ట్ ప్లేయర్లలో ఒకడు డేవిడ్ వార్నర్. అతడు కోల్‌కతా నైట్ రైడర్స్‌పై రెండు సెంచరీలను కొట్టాడు. మొదటిది 2010లో, రెండవది 2017లో సాధించాడు.

4 / 5
ఇక క్రిస్ గేల్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ యూనివర్సల్ బాస్ బరిలోకి దిగితే విధ్వంసమే. ఐపీఎల్‌లో అందరికంటే ఎక్కువ సెంచరీలు సాధించాడు క్రిస్ గేల్. ఏకంగా 6 శతకాలు కొట్టాడు. అలాగే పంజాబ్ కింగ్స్ జట్టుపై 2011, 2015 సీజన్లలో సెంచరీలు బాదేశాడు.

5 / 5
లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కెఎల్ రాహుల్ ఐపీఎల్‌లో 4 సెంచరీలు బాదగా.. అందులో మూడు శతకాలు ముంబైపై నమోదు చేశాడు. మరొకటి రాయల్‌ ఛాలెంజర్స్ బెంగుళూరుపై కొట్టాడు.