
అయితే ఐపీఎల్ ప్లేఆఫ్స్‌లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు ఎవరి పేరిట ఉందో తెలుసా..? ప్లేఆఫ్స్‌లో అత్యధిక పరుగులు చేసిన టాప్ 5 ప్లేయర్ల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

1. సురేష్ రైనా: ఐపీఎల్ ప్లే ఆఫ్స్‌లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు మాజీ చెన్నై ప్లేయర్, మిస్టర్ ఐపీఎల్ సురేష్ రైనా పేరిట ఉంది. ఐపీఎల్ ప్లేఆఫ్స్‌లో మొత్తం 24 ఇన్నింగ్స్ ఆడిన సురేశ్ రైనా 714 పరుగులతో టాప్ స్కోరర్‌గా ఉన్నాడు.

2. ఎంఎస్ ధోని: రైనా తర్వాత స్థానంలో మహేంద్ర సింగ్ ధోని రెండో స్థానంలో ఉన్నాడు. మొత్తం 22 ప్లేఆఫ్స్ ఇన్నింగ్స్ ఆడిన ధోని 523 పరుగులు చేశాడు.

3. షేన్ వాట్సన్: రైనా, ధోని తర్వాతి స్థానంలో చెన్నై మాజీ ఆటగాడు, ఢిల్లీ క్యాపిటల్స్ అసిస్టెంట్ కోచ్ షేన్ వాట్సన్ ఉన్నాడు. వాట్సన్ 12 ఇన్నింగ్స్‌లో 389 పరుగులు చేశాడు.

4. మైఖేల్ హస్సీ: ప్లేఆఫ్స్‌లో అత్యధిక పరగులు చేసిన నాల్గో ఆటగాడిగా చెన్నై మాజీ ఆటగాడు మైఖేల్ హస్సీ కొనసాగుతున్నాడు. హస్సీ 11 ప్లేఆఫ్స్ ఇన్నింగ్స్‌లో 388 పరుగులు సాధించాడు.

5. ఫాఫ్ డూప్లెసిస్: ఈ లిస్ట్‌లో చెన్నై మాజీ ఆటగాడు, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ప్రస్తుత కెప్టెన్ ఫాఫ్ డూప్లెసిస్ కూడా ఉన్నాడు. 14 ఇన్నింగ్స్‌లో 373 పరుగులు చేసిన ఫాఫ్ ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు.

అంటే ఐపీఎల్ ప్లేఆఫ్స్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు అంతా కూడా చెన్నై టీమ్‌కి చెందినవారు లేదా ఒకప్పుడు ధోని సేనలో భాగంగా ఆడినవారే. ఎందుకంటే ఐపీఎల్‌లో 14 సీజన్లు ఆడిన చెన్నై సూపర్ కింగ్స్ ఏకంగా 12 సార్లు ప్లేఆఫ్స్‌కి ప్రవేశించింది. అలాగే ఇప్పటికే 9 సార్లు ఫైనల్ మ్యాచ్ కూడా ఆడింది. ఈ కారణంగానే చెన్నై ప్లేయర్లు మాత్రమే ఈ టాప్ 5 లిస్టులో ఉన్నారు.