ముంబై ఇండియన్స్ వర్సెస్ కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో విజయం ఎవరిదన్నది పక్కన పెడితే.. అసలు హీరో ఎవరన్న ప్రశ్న వస్తే.. కచ్చితంగా ముంబై సీనియర్ బౌలర్ పేరు తప్పకుండా వస్తుంది. ఐదుగురు బ్యాట్స్‌మెన్‌లను పెవిలియన్ చేర్చిన జస్ప్రీత్ బుమ్రా.. ఈ మ్యాచ్‌లో హీరోగా మారాడన్నది నిజం. అది కూడా కేవలం 10 పరుగులకే మాత్రమే ఇచ్చి.. ట్రిపుల్ వికెట్ మెయిడిన్ ఓవర్ విసిరాడు. జస్ప్రీత్ బుమ్రా చేసిన టీ20 మ్యాచ్‌లలో ఇది చాలా అరుదుగా జరిగిందనడంలో సందేహం లేదు.
కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బుమ్రా 10 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్‌లో ముంబై తరపున బౌలర్‌కు ఇది రెండో అత్యుత్తమ ప్రదర్శన. అంతకుముందు 2019లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై అల్జారీ జోసెఫ్ 12 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టాడు.
ముంబై ఇండియన్స్ ఓటమి తర్వాత కూడా ఐపీఎల్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన బుమ్రా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. జట్టు ఓటమిలో బౌలర్‌కు ఇది రెండో అత్యుత్తమ ప్రదర్శనగా నిలిచింది. అంతకుముందు 2016 సంవత్సరంలో, రైజింగ్ పూణె సూపర్ జెయింట్స్ తరపున ఆడమ్ జంపా 6/19 తీసుకున్నాడు. ఆ జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓడిపోయింది.
ఐపీఎల్ చరిత్రలో బుమ్రా ప్రదర్శన రెండో అద్భుత ప్రదర్శనగా నిలిచింది. ఐపీఎల్‌లో అత్యల్ప పరుగులకు 5 వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా బుమ్రా నిలిచాడు. అతనికి ముందు 2009లో రాజస్థాన్ రాయల్స్‌పై అనిల్ కుంబ్లే 5 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు.
KKRకి వ్యతిరేకంగా, బుమ్రా తన 5 వికెట్లను షార్ట్ బంతుల్లో లేదా గుడ్ లెంగ్త్ బంతుల్లో పడగొట్టాడు. ESPNcricinfo ప్రకారం, IPLలో ఒక బౌలర్ ఆ లెంగ్త్‌లలో బౌలింగ్ చేసి 5 వికెట్లు తీయడం ఇదే మొదటిసారి.
ముంబై ఇండియన్స్ తరపున 5 వికెట్లు తీసిన 5వ బౌలర్ బుమ్రా. టోర్నీలో ఒక జట్టు సాధించిన అత్యధిక 5 వికెట్లు ఇదే. తన స్పెల్ సమయంలో 2 డెత్ ఓవర్లలో అత్యల్ప పరుగులు ఇచ్చిన ఆటగాడిగా బుమ్రా నిలిచాడు. అతను కేవలం 1 పరుగు మాత్రమే ఇచ్చాడు.