
IPL 2022 Mega Auction: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022కి ముందు మెగా వేలానికి దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మొత్తం 10 ఫ్రాంఛైజీలు 590 మంది ఆటగాళ్ల (370 భారతీయులు, 220 ఓవర్సీస్) జాబితా నుంచి ఎంపిక చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ 590 మంది క్రికెటర్లలో 228 మంది క్యాప్డ్ ప్లేయర్లు, 355 మంది అన్‌క్యాప్డ్ ప్లేయర్లు, ఏడుగురు అసోసియేట్ నేషన్స్‌కు చెందినవారు ఉన్నారు. IPL 2022 వేలంలో అత్యధిక బిడ్లను ఆకర్షించగల భారతీయ, విదేశీ ఆటగాళ్లను ఓసారి చూద్దాం..

1. మహమ్మద్ షమీ: పంజాబ్ కింగ్స్ మాజీ బౌలర్ మహమ్మద్ షమీని ఫ్రాంచైజీ రిటైన్ చేయలేదు. మహ్మద్ షమీ గత రెండు సంవత్సరాలలో టీమిండియా తరపున కొన్ని అద్భుతమైన ప్రదర్శనలతో తన పరిమిత-ఓవర్ల కెరీర్‌లో రాణించాడు. 2019 వేలంలో రూ. 4.8 కోట్ల భారీ ధరకు పంజాబ్ కింగ్స్ కొనుగోలు చేసింది.

2. రవిచంద్రన్ అశ్విన్: మాజీ చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ ఆటగాడు ఆర్. అశ్విన్ ఢిల్లీ క్యాపిటల్స్ కోసం గత కొన్ని ఐపీఎల్ సీజన్‌లో అద్భుతమైన ప్రదర్శనతో పరిమిత ఓవర్ల క్రికెట్‌లో తన కెరీర్‌ను ఘనంగా చాటాడు. ఈ ఆఫ్ స్పిన్నర్ పంజాబ్ నుంచి ఢిల్లీకి రూ. 7.6 కోట్లకు బదిలీ అయ్యాడు. గత మూడు సీజన్లలో, భారత అనుభవజ్ఞుడైన ఈ స్పిన్నర్ 35 వికెట్లు తీశాడు. దాదాపు 6 ఎకానమీ రేటులో వికెట్లు పడగొట్టాడు.

3. శ్రేయాస్ అయ్యర్: ఢిల్లీ క్యాపిటల్స్ మాజీ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్, కెప్టెన్‌గా ఎంపికయ్యే ఛాన్స్ ఉంది. IPL 2022కి ముందు జరిగే మెగా వేలంలో అత్యధిక బిడ్‌ని పొందే అవకాశం ఉంది. భారత బ్యాటర్ మిడిల్ ఆర్డర్‌లో స్థిరత్వాన్ని ప్రదర్శిస్తున్నాడు. అలాగే ఫీల్డింగ్‌లోనూ ఆకట్టుకుంటున్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు శ్రేయాస్‌పై ఆసక్తి చూపిస్తున్నాయి.

4. శిఖర్ ధావన్: గత సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ శిఖర్ ధావన్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ రిటైన్ చేసుకోలేదు. దీంతో ధావన్ వేలంలో అందుబాటులో ఉంటాడు. గతేడాది ధావన్‌కు ఢిల్లీ రూ. 5.2 కోట్లు చెల్లించింది. 2014లో జరిగిన IPL వేలంలో ధావన్ అత్యధిక వేతనాన్ని రూ. 12.5 కోట్లకు SRH కొనుగోలు చేసింది.

5. ఇషాన్ కిషన్: IPL 2022 మెగా వేలానికి ముందు ముంబై ఇండియన్స్ యువ తుఫాన్ బ్యాటర్ ఇషాన్ కిషన్‌ను ఆశ్చర్యకరంగా విడుదల చేసింది. వికెట్ కీపర్ 2016 నుంచి 61 IPL మ్యాచ్‌లలో 136.33 స్ట్రైక్ రేట్‌తో 1,452 పరుగులు చేశాడు. ఈ 23 ఏళ్ల యువకుడిని IPL 2018 వేలంలో రూ. 6.20 కోట్ల ధరకు MI కొనుగోలు చేసింది. ఇషాన్ బేస్ ధర రూ. 2 కోట్ల నిర్ణయించారు.

6. డేవిడ్ వార్నర్: సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ IPL 2022 వేలంలో అతిపెద్ద పేర్లలో ఒకటిగా నిలిచింది. వార్నర్ ఒక తుఫాన్ ఓపెనింగ్ బ్యాటింగ్‌తో ఏ జట్టులోనైనా ప్రవేశించగలడు. అలాగే నాయకత్వ లక్షణాలు కూడా కలిగి ఉన్నాడు. అయితే, SRHతో అతని చివరి కెప్టెన్సీ అనుభవం అంతగా బాగోలేదు. కానీ, అతను 2016లో హైదరాబాద్ ఫ్రాంచైజీని టైటిల్ విజయానికి నడిపించాడని మర్చిపోకూడదు.

7. ట్రెంట్ బౌల్ట్: ముంబై ఇండియన్స్ మాజీ పేసర్ ట్రెంట్ బౌల్ట్ IPL 2022 వేలంలో అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్లలో ఒకడు. ఎడమచేతి వాటం పేసర్ పవర్‌ప్లేలో ముందుగా వికెట్లు తీయడంలో నైపుణ్యం కలిగి ఉంటాడు. ముంబై ఇండియన్స్ అతనిని తిరిగి కొనుగోలు చేయడం, జస్ప్రీత్ బుమ్రాతో కలిసి పేస్ బౌలింగ్ దాడిని రూపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది.

8. పాట్ కమిన్స్: 2020 ఐపీఎల్ వేలంలో కోల్‌కతా నైట్ రైడర్స్ మాజీ పేసర్ పాట్ కమిన్స్‌ను ఫ్రాంచైజీ రూ. 15.5 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ ఆస్ట్రేలియన్ బంతితో గత సీజన్‌లో మంచి ప్రదర్శన చేయడంలో విఫలమయ్యాడు. అయితే అతను లోయర్ ఆర్డర్‌లో కొన్ని సులభతరమైన ఇంకా వేగంగా పరుగులు సాధించగలిగాడు. ఫాస్ట్-బౌలింగ్ ఆల్-రౌండర్‌గా పరిగణిస్తున్నారు. అలాగే IPL 2022 వేలం జాబితాలో చాలా తక్కువ మంది ఆల్ రౌండర్లు ఉన్నారనే వాస్తవాన్ని పరిగణనలోకి తీసుకుంటే, కమ్మిన్స్ మరోసారి మిలియనీర్ అయ్యే అవకాశాలను పొందగలడు.

9. క్వింటన్ డి కాక్: ముంబై ఇండియన్స్ మాజీ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ క్వింటన్ డి కాక్ ప్రపంచ క్రికెట్‌లో అత్యంత దూకుడైన బ్యాట్స్‌మెన్‌గా పేరుగాంచాడు. ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్ బౌలర్లపై దాడి చేయడానికి ఇష్టపడతాడు. అలాగే డికాక్ ఆట పొట్టి ఫార్మాట్‌కు అనుకూలంగా ఉంటుంది. క్వింటన్ డి కాక్ 2020 సీజన్‌లో అద్బుతంగా రాణించాడు. నాలుగు అర్ధ సెంచరీలతో సహా 503 పరుగులు చేశాడు. అయితే 2021 ఎడిషన్‌లో మాత్రం అంతగా రాణించలేదు.11 గేమ్‌లలో 297 పరుగులు మాత్రమే చేయగలిగాడు. డి కాక్ ఆడే ఏ జట్టుకైనా విలువైన ఆటగాడిగా ఉంటాడనడంలో సందేహం లేదు. IPL 2022 వేలంలో అనేక జట్లు అతనిపై కన్నేస్తాయనడంలో సందేహం లేదు.

10. కగిసో రబాడా: దక్షిణాఫ్రికా పేసర్ కగిసో రబాడా IPL 2021లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. అక్కడ అతను 8.14 ఎకానమీతో 15 వికెట్లు పడగొట్టాడు. రబాడాను ఢిల్లీ నిలబెట్టుకోలేదు. 2017లో ఢిల్లీ రూ. 4.2 కోట్లకు కొనుగోలు చేసింది. ఐపీఎల్ 2022 వేలంలో ఎక్కువ ధర పలికే అవకాశం ఉంది.