INDW vs ENGW: రికార్డులకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన భారత యువ సంచలనం.. 18 ఏళ్లు నిండకుండానే నెంబర్ వన్..! ఎందులోనో తెలుసా?

| Edited By: Venkata Chari

Jul 12, 2021 | 9:54 PM

భారత యువ బ్యాటర్ షెఫాలి వర్మ 17 సంవత్సరాల వయస్సులోనే క్రికెట్‌లో చాలా రికార్డులను సృష్టించింది. ఇంగ్లండ్ పర్యటనలో టెస్టుల్లో అరంగేట్రం చేసిన షెఫాలి.. ఏకైక టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లో అర్థ సెంచరీలతో ఆకట్టుకుంది.

1 / 5
భారత యువ బ్యాటర్ షెఫాలి వర్మ 17 సంవత్సరాల వయస్సులోనే క్రికెట్‌లో చాలా రికార్డులను సృష్టించింది. ఇంగ్లండ్ పర్యటనలో టెస్టుల్లో అరంగేట్రం చేసిన షెఫాలి.. ఏకైక టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లో అర్థ సెంచరీలతో ఆకట్టుకుంది. ప్రస్తుతం జరుగుతోన్న టీ20 సిరీస్‌లో.. రెండవ టీ20 మ్యాచ్‌లో షఫాలి వర్మ 48 పరుగులు సాధించింది. ఈ ఇన్నింగ్స్ కారణంగా భారత్ త్వరగా పరుగులు చేసేందుకు ఊతమిచ్చింది. మధ్యలో వికెట్ పడటం వల్ల భారత జట్టు 148 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేయడంతో రెండవ టీ20లో ఎనిమిది పరుగుల తేడాతో గెలిచింది. ఛేదనలో ఇంగ్లండ్ జట్టు 140 పరుగులు మాత్రమే చేయగలిగింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇరు జట్లు 1-1తో సమంగా నిలిచాయి.

2 / 5
షెఫాలి వర్మ ఇన్నింగ్స్‌లలో 38 బంతులను ఎదుర్కొని ఎనిమిది ఫోర్లు, ఒక సిక్సర్‌తో 48 పరుగులు చేసింది. ఈ సిక్సర్‌తో 18 ఏళ్లు రాకముందే మహిళల టీ 20 క్రికెట్‌లో 30 సిక్సర్లు కొట్టి, తొలిస్థానంలో నిలిచింది. ఈ రికార్డును ఇంతవరకు ఏప్లేయర్ కూడా నెలకొల్పక పోవడం విశేషం. మిగతా వారంతా కనీసం 10 సిక్సర్లు కూడా కొట్టలేకపోయారు.

3 / 5
మహిళల క్రికెట్‌లో 18 ఏళ్లు నిండకుండా అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాళ్లలో కేవలం ఇద్దరే ఉన్నారు. టీమిండియా ప్లేయర్ జెమిమా రోడ్రిగ్స్ ఒకరు కాగా, దక్షిణాఫ్రికాకు చెందిన ట్రియోన్ మరొకరు. అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌ల్లో ఈ ఇద్దరూ తలో మూడు సిక్సర్లు మాత్రమే కొట్టారు.

4 / 5
ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టీ 20 మ్యాచ్‌లో షఫాలి వర్మ.. ఇంగ్లండ్ ప్రధాన బౌలర్ కేథరీన్ బ్రంట్‌ పై విరుచపడింది. ఈ ఇంగ్లీష్ లెజెండ్ ఓ ఓవర్లో షెఫాలి వరుసగా ఐదు ఫోర్లు బాదింది. దీని తరువాత కేథరీన్ బ్రంట్ మరో ఓవర్ వేయలేదు. ఈ పర్యటనలో బ్రంట్, షెఫాలిల మధ్య తీవ్రమై పోటీ ఏర్పడింది. ఇంగ్లీష్ బౌలర్ షెఫాలీని చాలాసార్లు అవుట్ చేసింది. కానీ, జులై 11 న మాత్రం షెఫాలి చేతిలో బలైంది.

5 / 5
షెఫాలి వర్మ 15 సంవత్సరాల వయసులో భారత జట్టులో అడుగుపెట్టింది. టీ 20 ఫార్మాట్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసింది. ఇప్పటివరకు 24 టీ 20 మ్యాచ్‌ల్లో సగటున 28.91 సగటుతో 665 పరుగులు చేసింది. ఇందులో మూడు అర్ధ సెంచరీలు ఉన్నాయి. అలాగే 81 ఫోర్లు, 30 సిక్సర్లు పొట్టి క్రికెట్లో సాధించింది. షెఫాలి ప్రస్తుతం టీ 20 క్రికెట్‌లో నంబర్ వన్ మహిళా బ్యాట్స్‌మన్ గా నిలిచింది.