Dream Chasers Cup: ఏంది సామీ ఇది.. బ్యాటింగే అంటారా?.. 125 బంతుల్లో 30 సిక్స్‌లు, 28 ఫోర్లు.. బౌలర్లకు దబిడిదిబిడే..

| Edited By: Ravi Kiran

Nov 24, 2021 | 6:17 AM

అండర్-14 టోర్నమెంట్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ అకాడమీ బ్యాట్స్‌మెన్ ప్రత్యర్థి బౌలర్లకు పుట్టించాడు. ట్రిపుల్ సెంచరీతో అదరగొట్టాడు.

1 / 5
క్రీజ్‌లోకి వచ్చింది మొదలు.. మైదానంలో సిక్సర్లు, ఫోర్ల వర్షం కురిపించాడు. మ్యాచ్‌లో 30 సిక్సర్లు, 28 ఫోర్లు కొట్టి ప్రత్యర్థులకు చమటలు పట్టించాడు.

2 / 5
ఢిల్లీలో జరిగిన అండర్-14 టోర్నమెంట్‌లో 13 ఏళ్ల బ్యాట్స్‌మెన్ కేవలం 125 బంతుల్లో 331 పరుగులు చేశాడు. స్ట్రైక్ రేట్ 264 కంటే ఎక్కువే రికార్డ్ అయ్యింది.

3 / 5
ఢిల్లీకి చెందిన 13 ఏళ్ల మోహక్ కుమార్ అండర్-14 డ్రీమ్ ఛేజర్ కప్‌లో ట్రిపుల్ సెంచరీ సాధించాడు. బౌలర్లకు పట్టపగలే చుక్కలు చూపించాడు. లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ అయిన మోహక్.. కేవలం సిక్సర్లతోనే 180 పరుగులు చేయగా, ఫోర్లతో 112 పరుగులు చేశాడు. మొత్తంగా 331 పరుగులు చేసి సంచలన రికార్డ్ నెలకొల్పాడు.

4 / 5
 ఈ విధ్వంసకర బ్యాటింగ్ గురించి ఢిల్లీ క్యాపిటల్స్ అధికారిక సోషల్ మీడియా ఖాతాలో వెల్లడించింది. మోహాక్ కుమార్ విధ్వంసకర ఇన్నింగ్స్‌ గురించి సోషల్ మీడియాలో షేర్ చేసింది. అతని బ్యాటింగ్‌కు సంబంధించిన వీడియోను సైతం షేర్ చేసింది.

5 / 5
ఇకపోతే, 2016 సంవత్సరంలో, మహారాష్ట్ర క్రికెటర్ ప్రణవ్ ధనవాడే స్కూల్ క్రికెట్‌లో తన బ్యాటింగ్‌తో అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. ఒక మ్యాచ్‌లో 1,009 పరుగులు చేసి.. ప్రపంచంలో ఒక మ్యాచ్‌లో 1000 పరుగులు చేసిన ఏకైక బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. అతని కంటే ముందు ఇంగ్లండ్ ఆటగాడు ఇజె కాలిన్స్ 1899లో 628 పరుగులు చేశాడు.