Rohit Sharma: ‘సిక్సర్ కింగ్’గా అవతరించిన హిట్‌మ్యాన్.. షాహిద్ అఫ్రిదీ రికార్డుకు చెక్.. ఎవరెన్ని సిక్సర్లు కొట్టాడంటే..?

|

Sep 13, 2023 | 12:28 PM

Rohit Sharma: భారత్, శ్రీలంక మధ్య జరిగిన ఆసియా కప్‌ సూపర్ 4 క్లాష్‌లో రోహిత్ సేన విజయం సాధించింది. మ్యాచ్ ఆసాంతం ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో లంకపై భారత్ 41 పరుగుల తేడాతో విజయం సాధించడంతో పాటు టోర్నీ ఫైనల్‌కు అర్హత సాధించింది. ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా టాప్ స్కోరర్‌గా కెప్టెన్ రోహిత్ శర్మ 53 పరుగులతో నిలిచాడు. ఈ క్రమంలో రోహిత్.. పాకిస్తాన్ మాజీ క్రికెటర్‌ షాహిద్ అఫ్రిదీ పేరిట ఉన్న ఓ అరుదైన రికార్డును బ్రేక్ చేసి ఆసియా కప్ టోర్నీలోనే టాప్ ప్లేయర్‌గా నిలిచాడు. ఇంతకీ రోహిత్ బ్రేక్ చేసిన అఫ్రిదీ రికార్డ్ ఏమిటంటే..

1 / 5
భారత్, శ్రీలంక మధ్య మంగళవారం జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ 48 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 53 పరుగులు చేశాడు. ఈ క్రమంలో కోహ్లీ తర్వాత అత్యంత వేగంగా 10000 వన్డే పరుగులు చేసిన రెండో ఆటగాడిగా రోహిత్  అవతరించాడు.

2 / 5
అంతేకాక లంకపై కొట్టిన రెండు సిక్సర్ల ద్వారా కూడా ఆసియా కప్ టోర్నీలోనే అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా అగ్రస్థానాన్ని రోహిత్ అధిరోహించాడు. ఇందుకోసం షాహిద్ అఫ్రిదీ సిక్సర్ల లెక్కను కూడా హిట్ మ్యాన్ అధిగమించాడు.

3 / 5
ఈ మ్యాచ్ జరగకముందు పాక్ మాజీ షాహిద్ అఫ్రిదీ 26 సిక్సర్లతో ఆసియా కప్ టోర్నీలో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా ఉండేవాడు. అయితే లంకపై కొట్టిన రెండు సిక్సర్లతో ఆ స్థానాన్ని రోహిత్ సొంతం చేసుకున్నాడు.

4 / 5
ఆసియా కప్‌లో ఇప్పటివరకు 26 మ్యాచ్‌లు ఆడిన రోహిత్ 28 సిక్సర్లతో అగ్రస్థానంలో ఉండగా.. 23 మ్యాచ్‌ల్లో 26 సిక్సర్లు బాదిన అఫ్రిదీ రెండో స్థానంలో ఉన్నాడు.

5 / 5
అలాగే ఈ లిస్టు మూడో స్థానంలో శ్రీలంక మాజీ ఓపెనర్ సనత్ జయసూర్య ఉన్నాడు. ఆసియా కప్‌లో జయసూర్య 25 మ్యాచ్‌లు ఆడి 23 సిక్సర్లు బాదడం ద్వారా ఈ రికార్డును కలిగి ఉన్నాడు.