IND vs SL: తొలి వన్డేలో కెప్టెన్‌గా ప్రపంచ రికార్డు సృష్టించిన రోహిత్ శర్మ.. అదేంటంటే?

|

Aug 03, 2024 | 8:06 AM

Rohit Sharma: శ్రీలంకతో జరిగిన తొలి వన్డే గురించి మాట్లాడితే.. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన రోహిత్ అద్భుత హాఫ్ సెంచరీ చేశాడు. 47 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 58 పరుగులు చేశాడు. 15వ ఓవర్లో దునిత్ వెల్లాలఘే వేసిన బంతికి రోహిత్ ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు. అయితే, ఈ మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. తొలి వన్డే టైగా ముగిసింది.

1 / 8
Rohit Sharma: టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ను ఛాంపియన్‌గా నిలిపిన కెప్టెన్ రోహిత్ శర్మ.. ఇప్పుడు వన్డే క్రికెట్‌లోనూ తన తుఫాన్ ఆటతో ప్రపంచ రికార్డు సృష్టించాడు. శ్రీలంకతో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో ఈ ఘనత సాధించిన హిట్‌మ్యాన్ ప్రపంచ నంబర్ 1 కెప్టెన్‌గా నిలిచాడు.

2 / 8
అంతర్జాతీయ క్రికెట్‌లో ఇప్పటివరకు ఏ కెప్టెన్ చేయని ఘనతను రోహిత్ శర్మ సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ప్రపంచ నంబర్ 1 కెప్టెన్ హిట్‌మ్యాన్. శ్రీలంకపై 3 సిక్సర్లు కొట్టి రోహిత్ ఈ రికార్డు నెలకొల్పాడు.

3 / 8
ఈ విషయంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ రికార్డును బద్దలు కొట్టాడు. గతంలో మోర్గాన్ కెప్టెన్‌గా 233 సిక్సర్లు బాదాడు. ఈ మ్యాచ్‌కు ముందు రోహిత్ పేరిట 231 సిక్సర్లు ఉన్నాయి. ఇప్పుడు లంకపై మూడు సిక్సర్లు బాది మోర్గాన్‌ను రోహిత్ అధిగమించాడు.

4 / 8
దీంతో వన్డే కెరీర్‌లో ఎక్కువ సిక్సర్లు బాదిన బ్యాట్స్‌మెన్ జాబితాలో రోహిత్ ఇప్పుడు మూడో స్థానానికి చేరుకున్నాడు. ప్రస్తుతం రోహిత్ వన్డేల్లో 326 సిక్సర్లు బాదాడు. మరో 6 సిక్సర్లు బాదితే వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ రికార్డును రోహిత్ బ్రేక్ చేస్తాడు.

5 / 8
ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్న గేల్ తన వన్డే కెరీర్‌లో 331 సిక్సర్లు కొట్టాడు. వన్డే క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది రికార్డు సృష్టించాడు. షాహిద్ వన్డేల్లో మొత్తం 351 సిక్సర్లు బాదాడు. మరికొద్ది రోజుల్లో అఫ్రిది రికార్డును కూడా రోహిత్ బ్రేక్ చేయనున్నాడు.

6 / 8
ఇక మూడు ఫార్మాట్లలో ఎక్కువ సిక్సర్లు బాదిన బ్యాట్స్‌మెన్ గురించి చెప్పాలంటే.. ఈ జాబితాలో రోహిత్ శర్మ నంబర్ 1. రోహిత్ తన అంతర్జాతీయ కెరీర్‌లో ఇప్పటివరకు 612 సిక్సర్లు కొట్టాడు.

7 / 8
మూడు ఫార్మాట్లలో కలిపి 553 సిక్సర్లు బాదిన క్రిస్ గేల్ రోహిత్ తర్వాతి స్థానంలో ఉన్నాడు. 476 సిక్సర్లు బాదిన షాహిద్ అఫ్రిది ఈ విషయంలో మూడో స్థానంలో ఉన్నాడు. త్వరలో సిక్సర్ల విషయంలో రోహిత్ అన్ని చోట్లా నంబర్ 1 అవుతాడనే చెప్పాలి.

8 / 8
ఇప్పుడు శ్రీలంకతో జరిగిన తొలి వన్డే గురించి మాట్లాడితే.. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన రోహిత్ అద్భుత హాఫ్ సెంచరీ చేశాడు. 47 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 58 పరుగులు చేశాడు. 15వ ఓవర్లో దునిత్ వెల్లాలఘే వేసిన బంతికి రోహిత్ ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు.