IND Vs SA: సిరీస్ వశం.. టీ20ల్లో టీమిండియా రికార్డుల శివతాండవం.. వివరాలు ఇవిగో

భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరిగిన చివరి టీ20లో భారత్ అద్భుత ప్రదర్శన చేసింది. సంజూ శాంసన్‌, తిలక్‌ వర్మ అజేయ సెంచరీలతో 283 పరుగులతో రికార్డు సృష్టించారు. విదేశాల్లో భారత్‌లో ఇదే అత్యధికం..

Ravi Kiran

|

Updated on: Nov 16, 2024 | 12:49 PM

దక్షిణాఫ్రికాతో జరిగిన చివరి టీ20లో టీమిండియా ఘన విజయం సాధించింది. వన్ సైడెడ్‌గా జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా బ్యాటర్లు విరుచుకుపడ్డారు. ఏకంగా 135 పరుగుల తేడాతో సఫారీలను చిత్తు చేసింది భారత జట్టు.

1 / 5
ఈ మ్యాచ్‌లో పలు కీలక రికార్డులను బద్దలు కొట్టింది టీమిండియా. మెన్స్ టీ20లో 3 సార్లు 250+ స్కోర్ చేసిన తొలి జట్టుగా భారత్ జట్టు నిలిచింది.

2 / 5
సంజూ శాంసన్, తిలక్ వర్మ నమోదు చేసిన 210 పరుగుల భాగస్వామ్యం ఏ వికెట్‌కైనా భారత్ తరపున ఇదే అత్యధికం. అటు ఐసీసీ ఫుల్ టైం టీమ్స్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో ఇద్దరు(సంజూ-109, తిలక్-120) బ్యాటర్లు సెంచరీలు చేయడం ఇదే తొలిసారి

3 / 5
అలాగే ఒక సిరీస్‌లో 4 సెంచరీలు నమోదు కావడం ఇదే తొలిసారి. ఇక సఫారీలు 135 పరుగుల తేడాతో చిత్తు కావడం కూడా ఇదే మొదటిసారి.

4 / 5
 ఇక టీమిండియా ఈ మ్యాచ్‌లో 23 సిక్సర్లు కొట్టగా.. టీ20లలో అత్యధిక సిక్సర్లు కొట్టిన జట్టుగా మూడో స్థానంలో నిలిచింది. మొదటి స్థానంలో జింబాబ్వే(27), రెండో స్థానంలో నేపాల్(26) ఉన్నారు.

5 / 5
Follow us