IND vs WI: బాబర్‌ రికార్డుకు ఇచ్చిపడేసిన టీమిండియా ఫ్యూచర్ స్టార్.. ఆ లిస్టులో ప్రపంచ నంబర్ వన్ మనోడే..

|

Jul 31, 2023 | 5:30 AM

IND vs WI: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లేకపోవడంతో వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో టీమిండియా ఓటమి పాలైంది. వెస్టిండీస్ 6 వికెట్ల తేడాతో టీమిండియాపై విజయం సాధించింది. టీమిండియా 40.5 ఓవర్లలో 181 పరుగులకే పరిమితమైంది.

1 / 10
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లేకపోవడంతో వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో టీమిండియా ఓటమి పాలైంది. వెస్టిండీస్ 6 వికెట్ల తేడాతో టీమిండియాపై విజయం సాధించింది. టీమిండియా 40.5 ఓవర్లలో 181 పరుగులకే పరిమితమైంది. అనంతరం బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 36.4 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయం సాధించింది.

2 / 10
ఈ విజయంతో విండీస్ మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. శుభారంభం తర్వాత టీమిండియా బ్యాట్స్‌మెన్ పేలవ ప్రదర్శన చేయడం ఓటమికి దారి తీసింది. ఓపెనింగ్ జోడీ ఇషాన్ కిషన్, శుభ్‌మన్ గిల్ 90 పరుగుల భాగస్వామ్యంతో జట్టుకు శుభారంభం అందించినా మిగిలిన ఆటగాళ్లు దానిని కొనసాగించలేదు.

3 / 10
ఈ మ్యాచ్‌లో 49 బంతులు ఎదుర్కొన్న శుభ్‌మన్ గిల్ 5 బౌండరీల సాయంతో 39 పరుగులు చేశాడు. అలాగే ఇదే మ్యాచ్‌లో గిల్ 34 పరుగులతో వన్డేల్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, ఇతర అనుభవజ్ఞులైన ఆటగాళ్లు చేయలేని రికార్డును సృష్టించాడు.

4 / 10
వన్డే క్రికెట్‌లోని మొదటి 26 ఇన్నింగ్స్‌లలో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌ల జాబితాలో పాకిస్తాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ బాబర్ అజామ్ అగ్రస్థానంలో ఉన్నాడు. అయితే ఇప్పుడు ఈ రికార్డును గిల్ బద్దలు కొట్టి మొదటి స్థానాన్ని ఆక్రమించాడు.

5 / 10
2019లో వన్డేల్లో అరంగేట్రం చేసిన శుభ్‌మన్ 26 ఇన్నింగ్స్‌ల్లో 1352 పరుగులు చేశాడు. 61.45 సగటుతో పరుగులు చేసిన గిల్ 1 డబుల్ సెంచరీ, 4 సెంచరీలు, 5 అర్ధసెంచరీలు చేశాడు. శుభ్‌మన్ కంటే ముందు ఈ రికార్డును లిఖించిన ఆటగాళ్లను ఓసారి చూద్దాం..

6 / 10
శుభ్‌మన్ గిల్- 26 ఇన్నింగ్స్‌లు, 1352 పరుగులు

7 / 10
బాబర్ ఆజం- 26 ఇన్నింగ్స్‌లు, 1322 పరుగులు

8 / 10
జోనాథన్ ట్రాట్- 26 ఇన్నింగ్స్‌లు, 1303 పరుగులు

9 / 10
ఫఖర్ జమాన్- 26 ఇన్నింగ్స్‌లు, 1275 పరుగులు

10 / 10
రోసీ వాన్ డెర్ డస్సెన్- 26 ఇన్నింగ్స్‌లు, 1267 పరుగులు