Virat Kohli: రాస్ టేలర్ రికార్డ్‌ని ‘క్యాచ్’ పట్టేసిన కోహ్లీ.. బ్యాట్ పట్టకుండానే వన్డే చరిత్రలో నాల్గో ప్లేయర్‌గా..

|

Jul 28, 2023 | 9:38 PM

IND vs WI 1st ODI: వెస్టిండీస్‌తో గురువారం జరిగిన తొలి వన్డేలో భారత్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌కి రాకుండానే అరుదైన ఘనత సాధించాడు. దీంతో న్యూజిలాండ్ దిగ్గజ ఆటగాడు రాస్ టేలర్ పేరిట ఉన్న ఓ రికార్డును సమం చేశాడు. ఇంతకీ కోహ్లీ సాధించిన ఆ ఘనత ఏమిటంటే..?

1 / 6
Virat Kohli: భారత్-వెస్టిండీస్‌ తొలి మ్యాచ్‌లో కోహ్లీ బ్యాటింగ్ చేయలేదు. అతని స్థానంలో యువ ఆటగాళ్లకు అవకాశం వచ్చింది. భారత్ 5 వికెట్లు కోల్పోయినా కోహ్లీకి బ్యాటింగ్ అవకాశం రాకపోవడం ఇదే తొలి సారి కావచ్చు.

2 / 6
అయితే బ్యాటింగ్‌కి దిగకుండానే కోహ్లీ ఓ అరుదైన రికార్డ్ సాధించాడు. మ్యాచ్‌లో తనకు బ్యాటింగ్ చేసే అవకాశం రాకపోయినా న్యూజిలాండ్ మాజీ కెప్టెన్, దిగ్గజ బ్యాటర్ రాస్ టేలర్ రికార్డ్‌ని కోహ్లీ సమం చేయడమే కాక, వన్డే చరిత్రలో టాప్ 4 లిస్టులోకి ప్రవేశించాడు.

3 / 6
అదేలా అంటే..  రవీంద్ర జడేజా వేసిన 18వ ఓవర్‌లో రొమరియో షెఫర్డ్ ఇచ్చిన క్యాచ్‌ పట్టుకున్నాడు కోహ్లీ. ఇది కోహ్లీకి తన వన్డే కెరీర్‌లో 142వ క్యాచ్‌. అంతే.. వన్డే క్రికెట్‌లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన 4వ ఆటగాడిగా కోహ్లీ అవతరించాడు.

4 / 6
అలాగే కోహ్లీ తన కంటే ముందే 142 క్యాచ్‌లతో అత్యధిక వన్డే క్యాచ్‌లు పట్టి నాల్గో స్థానంలో కొనసాగుతున్న రాస్ టేలర్ రికార్డ్‌ని సమం చేశాడు. రాస్ టేలర్ 236 మ్యాచ్‌ల్లో ఈ ఘనత సాధించగా.. కోహ్లీ 275 మ్యాచ్‌ల్లో టేలర్ రికార్డ్‌ని సమం చేశాడు.

5 / 6
కాగా, వన్డే క్రికెట్‌లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఆటగాడిగా శ్రీలంక దిగ్గజం మహేల జయవర్ధనే అగ్రస్థానంలో ఉన్నాడు. జయవర్ధనే 448 మ్యాచ్‌ల్లో 218 క్యాచ్‌లు పట్టుకున్నాడు.

6 / 6
160 వన్డే క్యాచ్‌లు పట్టిన రికీ పాంటింగ్(375 మ్యాచ్‌లు) రెండో స్థానంలో.. 156 క్యాచ్‌లతో భారత మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్(334 మ్యాచ్‌లు) మూడో స్థానంలో ఉన్నారు.