రాంచీ టీ20లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ 36 బంతుల్లో 55 పరుగులు చేశాడు. తన ఇన్నింగ్స్‌లో 5 సిక్సర్లు, 1 ఫోర్ ఉన్నాయి. ఈ 5 సిక్సర్లతో, రోహిత్ 5 భారీ రికార్డులను నెలకొల్పాడు.
టీ20 మ్యాచ్‌లో 11 సార్లు 5 ప్లస్ సిక్స్‌లు కొట్టిన రికార్డు ఇప్పుడు రోహిత్ శర్మ పేరిట నెలకొంది. ఇంతకుముందు ఈ లిస్టులో క్రిస్ గేల్‌లో కలిసి సంయుక్తంగా మొదటి స్థానంలో ఉన్నారు. అయితే రాంచీ టీ20తో గేల్‌ను వెనక్కి నెట్టి అగ్రస్థానం చేరాడు రోహిత్.
కెప్టెన్‌గా ఒక టీ20 మ్యాచ్‌లో 5 లేదా అంతకంటే ఎక్కువ సిక్సర్లు సాధించిన బ్యాట్స్‌మెన్‌గా రోహిత్ శర్మ నిలిచాడు. ఈ విషయంలో ఇంగ్లండ్ కెప్టెన్ ఓన్ మోర్గాన్ రికార్డును సమం చేశాడు.
అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత వేగంగా 450 సిక్సర్లు బాదిన బ్యాట్స్‌మెన్‌గా రోహిత్ శర్మ నిలిచాడు. 404 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించాడు. షాహిద్ అఫ్రిది 487 ఇన్నింగ్స్‌ల్లో, క్రిస్ గేల్ 499 ఇన్నింగ్స్‌ల్లో ఈ అద్భుత రికార్డును చేరుకున్నారు.
అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్లలో రోహిత్ శర్మ ప్రస్తుతం మూడో స్థానంలో ఉన్నాడు. అతని కంటే ముందు క్రిస్ గేల్ (553), షాహిద్ అఫ్రిది (476) ఎక్కువ సిక్సర్లు కొట్టారు.
టీ20లో తొలి 10 ఓవర్లు ఆడిన తర్వాత రోహిత్ శర్మ బౌండరీ బాదకపోవడం ఇదే తొలిసారి. అప్పటి వరకు 3 సిక్సర్లు మాత్రమే కొట్టాడు.