- Telugu News Photo Gallery Cricket photos IND vs NZ Team India Bowler R Ashwin Conceded 20 Runs in An Over For The First Time in His Test Career
IND vs NZ: బెంగళూరులో అశ్విన్ చెత్త రికార్డ్.. టెస్ట్ కెరీర్‌లో ఇదే తొలిసారి..
R Ashwin: బెంగళూరులో జరుగుతోన్న భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్‌లో ఫలితం వచ్చేలా ఉంది. అయితే, టీమిండియాకు ఈ ఫలితం అనుకూలంగా రావపోవచ్చని తెలుస్తోంది. నాలుగో రోజు టీమిండియా ఎలాంటి పరిస్థితుల్లో నిలుస్తోందో చూస్తేనే.. తర్వాత పరిస్థితి అర్థమవుతోంది. అయితే, ఈ టెస్ట్‌లో అశ్విన్ ఓ చెత్త రికార్డ్ నమోదు చేశాడు. అదేంటో ఓసారి చూద్దాం..
Updated on: Oct 19, 2024 | 7:39 AM

బెంగళూరులోని ఎం.చిన్నస్వామి స్టేడియం వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో టీమిండియా రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ జట్టును 402 పరుగులకు ఆలౌట్ చేయడంలో టీమిండియా బౌలర్లు సఫలమయ్యారు.

టీమిండియా తరపున కుల్దీప్, జడేజాలు చెరో 3 వికెట్లు తీయగా, సిరాజ్ 2 వికెట్లు, బుమ్రా, అశ్విన్ చెరో వికెట్ తీశారు. అయితే బెంగళూరు టెస్టులో అశ్విన్‌కు ఇప్పటి వరకు ప్రత్యేకంగా ఏం జరగలేదు. తొలుత బ్యాటింగ్‌లో వైఫల్యం చవిచూసిన అశ్విన్.. ఆ తర్వాత బౌలింగ్‌లోనూ అవాంఛనీయ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.

ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 16 ఓవర్లు బౌలింగ్ చేసిన అశ్విన్ 5.87 ఎకానమీ వద్ద 94 పరుగులు ఇచ్చి 1 వికెట్ మాత్రమే తీసుకున్నాడు. కానీ, ఈ మ్యాచ్‌లో అతను బౌల్ చేసిన ఓవర్‌లో అత్యధిక పరుగులు ఇచ్చాడు. అతని టెస్ట్ కెరీర్‌లో మొదటిసారి ఈ అవాంఛిత రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.

నిజానికి న్యూజిలాండ్ ఇన్నింగ్స్ 80వ ఓవర్ వేసిన అశ్విన్ ఈ ఓవర్లో మొత్తం 20 పరుగులు ఇచ్చాడు. ఇందులో 3 బౌండరీలు, 1 సిక్స్ ఉన్నాయి. ఆర్ అశ్విన్ టెస్టు కెరీర్‌లో ఒక ఓవర్‌లో 20 పరుగులు ఇవ్వడం ఇదే తొలిసారి.

అశ్విన్ తన టెస్టు కెరీర్‌లో ఒక్క ఓవర్‌లో 17 పరుగులకు మించి ఇవ్వలేదు. అలాగే, అతను ఒక ఓవర్‌లో 17 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు ఇవ్వడం 2016 తర్వాత ఇదే మొదటిసారి. అంతేకాదు, భారత్‌లో జరిగిన టెస్టు మ్యాచ్‌లో ఆర్ అశ్విన్ 20వ సారి కేవలం 1 వికెట్ మాత్రమే తీయగలిగాడు.




