- Telugu News Photo Gallery Cricket photos IND Vs ENG Team India Star Bowler Jasprit Bumrah Equals Kapil Dev's 41 Years Old Record In Test Cricket
IND vs ENG: 41 ఏళ్ల రికార్డును సమం చేసిన జస్ప్రీత్ బుమ్రా.. ఏకంగా కపిల్ దేవ్ స్పెషల్ రికార్డులో..
Jasprit Bumrah Equals Kapil Dev Record: విశాఖపట్నం వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా 6 వికెట్లు పడగొట్టి ఎన్నో రికార్డులు సృష్టించాడు. అందులో ముఖ్యమైనది టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ 41 ఏళ్ల రికార్డు.
Updated on: Feb 04, 2024 | 8:32 AM

విశాఖపట్నం వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా 6 వికెట్లు పడగొట్టి ఎన్నో రికార్డులు సృష్టించాడు. అందులో ముఖ్యమైనది టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ 41 ఏళ్ల రికార్డు.

జస్ప్రీత్ బుమ్రా రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు పడగొట్టాడు. అతను ఆలీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్, టామ్ విలియం హార్ట్‌లీతో పాటు జేమ్స్ అండర్సన్‌ల వికెట్లు పడగొట్టాడు.

బుమ్రా తీసిన ఈ 6 వికెట్లలో 4 వికెట్లు 3 నుంచి 6వ వరుస క్రమంలో బ్యాట్స్‌మెన్‌లవే. 1983 తర్వాత భారత్‌లో ఒక ఫాస్ట్ బౌలర్ నం.3, నం.4, 5, 6వ ర్యాంక్ బ్యాట్స్‌మెన్‌ల వికెట్లు తీయడం ఇదే తొలిసారి.

అంతకుముందు 1983లో అహ్మదాబాద్‌లో వెస్టిండీస్‌పై కపిల్ దేవ్ ఇలాంటి ఘనత సాధించాడు. ఆ మ్యాచ్‌లో కపిల్ దేవ్ 83 పరుగులిచ్చి 9 వికెట్లు తీశాడు.

టెస్టు క్రికెట్‌లో ఈ ఘనత సాధించిన రెండో భారత పేసర్‌గా బుమ్రా నిలిచాడు. దీంతో కపిల్ దేవ్ 41 ఏళ్ల రికార్డును సమం చేశాడు. అలాగే టెస్టుల్లో అత్యంత వేగంగా 150 వికెట్లు తీసిన 8వ బౌలర్‌గా నిలిచాడు.

అలాగే అతి తక్కువ బంతుల్లో 150 వికెట్లు పూర్తి చేసిన తొలి బౌలర్‌గా బుమ్రా రికార్డు సృష్టించాడు. బుమ్రా 6781 బంతుల్లో 150 వికెట్ల మైలురాయిని అధిగమించాడు.

బుమ్రా కంటే ముందు ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్న పేస్‌మెన్ ఉమేష్ యాదవ్ 7661 బంతుల్లో 150 వికెట్లు పడగొట్టాడు. ఈ జాబితాలో బుమ్రా అగ్రస్థానంలో ఉండగా, ఉమేష్ యాదవ్ రెండో స్థానానికి పడిపోయాడు.

వీరిద్దరూ కాకుండా అతి తక్కువ బంతుల్లో 150 వికెట్లు పూర్తి చేసిన భారత పేసర్లలో మూడో స్థానంలో ఉన్న మహ్మద్ షమీ 7755 బంతుల్లోనే ఈ ఘనత సాధించాడు. 8378 బంతుల్లో 150 వికెట్లు తీసిన కపిల్ దేవ్ నాలుగో స్థానంలో ఉన్నాడు.




