ఆర్. అశ్విన్‌ను.. విరాట్ కోహ్లీ జట్టుకు దూరంగా ఉంచాలనే నిర్ణయంతో ఎవరూ అంగీకరించడం లేదు. మాజీలు కూడా కోహ్లీపై మండిపడుతున్నారు. కానీ, విరాట్ కోహ్లీ తనకు నచ్చినట్లు చేస్తున్నాడంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ప్లేయింగ్ ఎలెవన్‌లో అవరసరం లేదంటూ మాట్లాడుతున్నాడు. అయితే మూడో టెస్ట్ ఫలితంతో కోహ్లీపై తీవ్రంగా విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఓవల్‌లో జరిగే నాల్గవ టెస్టులో అశ్విన్ ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కే అవకాశం ఉందంటూ వార్తలు వెలువడుతున్నాయి. దీనికి మూడు కారణాలు ఉన్నాయి. ఒకటి, సిరీస్ సమం చేసిన తర్వాత, భారత జట్టుకు నాలుగో టెస్టులో విజయం తప్పనిసరి. అలాగే రెండవది రవీంద్ర జడేజా గాయపడ్డాడు. అతని స్థానంలో అశ్విన్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. మూడవది, అతి ముఖ్యమైనది ఏమిటంటే, సిరీస్ ప్రారంభానికి ముందు సర్రే కోసం అశ్విన్ రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు తీసిన మైదానంలోనే నాలుగో టెస్టు జరగనుంది.