
ఆదివారం కటక్‌లోని బారాబతి స్టేడియంలో భారత్, ఇంగ్లాండ్ మధ్య జరుగులోన్న రెండో వన్డే మ్యాచ్‌కు ఫ్లడ్‌లైట్ పనిచేయకపోవడం వల్ల అంతరాయం కలిగింది.

భారత ఇన్నింగ్స్ ఏడో ఓవర్ ప్రారంభానికి ముందు మొదటి అంతరాయం ఏర్పడింది. సాకిబ్ మహమూద్ ఏడో ఓవర్ మొదటి బంతిని వేసిన తర్వాత ఆటకు మళ్లీ అంతరాయం కలిగింది.

మొత్తం ఫ్లడ్ లైట్ టవర్ ఆగిపోయింది. దీని వలన 10 నిమిషాలు ఆలస్యం అయింది. ఆ తర్వాత ఆటగాళ్లు మైదానం నుంచి వెళ్ళిపోయారు.

ఈ సమయంలో భారత జట్టు 6.1 ఓవర్లు ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 48 పరుగులు చేసింది.

అంతకుముందు బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ 49.5 ఓవర్లలో 304 పరుగులు చేసింది.