టీమిండియా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. మూడో టీ20లో ఆడనున్న మహ్మద్ షమీ.. కోచ్ కీలక స్టేట్‌మెంట్

|

Jan 27, 2025 | 9:20 PM

Mohammed Shami Fitness Update: రాజ్ కోట్‌లో జరిగే మూడో టీ20ఐ మ్యాచ్ కోసం భారత్, ఇంగ్లండ్ జట్లు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. హ్యాట్రిక్ విజయంపై కన్నేసిన భారత జట్టు, సిరీస్ గెలవాలని కోరుకుంటోంది. ఈ క్రమంలో టీమిండియాకు ఓ గుడ్ న్యూస్ వచ్చినట్లైంది. టీమిండియా స్టార్ పేసర్ రాజ్ కోట్ మ్యాచ్‌లో రీఎంట్రీ ఇవ్వనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

1 / 5
Mohammed Shami Fitness Update: భారత జట్టు వెటరన్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ ఫిట్‌నెస్ గురించి అభిమానుల మనస్సులలో తరచుగా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మహ్మద్ షమీ పూర్తిగా ఫిట్‌గా ఉన్నాడా లేదా అని తెలుసుకోవాలని అభిమానులు ఆసక్తిగా ఉన్నారు. ఇప్పుడు మూడో టీ20 మ్యాచ్‌కు ముందు, షమీ ఫిట్‌నెస్‌పై భారత జట్టు బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ పెద్ద స్పందన ఇచ్చాడు. మహ్మద్ షమీ పూర్తిగా ఫిట్‌గా ఉన్నాడని సితాన్షు కోటక్ తెలిపాడు. మూడో టీ20 మ్యాచ్‌లో షమీ ఆడే అవకాశం ఉందని అతని ప్రకటన సూచిస్తుంది.

2 / 5
నిజానికి మహ్మద్ షమీ చాలా కాలంగా గాయపడ్డాడు. ఈ కారణంగా ఏడాదికి పైగా భారత్ తరపున ఏ మ్యాచ్ ఆడలేకపోయాడు. ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు తిరిగి జట్టులోకి వచ్చాడు. ఇంగ్లండ్‌తో జరిగే టీ20 సిరీస్‌కు భారత జట్టులో షమీకి చోటు కల్పించారు. అయితే, తొలి రెండు టీ20 మ్యాచ్‌ల్లోనూ అతనికి ఆడే అవకాశం రాలేదు. ఆ తర్వాత, బహుశా షమీ ఇంకా పూర్తిగా ఫిట్‌గా లేడని, అందుకే ఆడలేడని ఊహాగానాలు మొదలయ్యాయి.

3 / 5
ఇప్పుడు మహ్మద్ షమీ ఫిట్‌నెస్‌పై టీమ్ ఇండియా కొత్త బ్యాటింగ్ కోచ్ సింతాషు కోటక్ పెద్ద ప్రకటన ఇచ్చాడు. రాజ్‌కోట్‌లో మూడో టీ20 మ్యాచ్‌కు ముందు జరిగిన సంభాషణలో ఆయన మాట్లాడుతూ.. మహ్మద్ షమీ ఫిట్‌గా ఉన్నాడు. అతను ఏ మ్యాచ్‌లో ఆడాలనేది టీమ్ మేనేజ్‌మెంట్ నిర్ణయిస్తుంది" అని తెలిపాడు.

4 / 5
ఈ క్రమంలోనే రాజ్ కోట్‌లో జరిగే మూడో మ్యాచ్‌లో మహ్మద్ షమీ ఆడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. షమీ రీఎంట్రీ కోసం భారత ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇదే జరిగితే భారత జట్టు నుంచి రవి బిష్ణోయ్‌ని తప్పించే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఎందుకంటే, ఇప్పటివరకు ఆడిన 2 మ్యాచ్‌ల్లోనూ వికెట్లు పడగొట్టలేకపోయాడు.

5 / 5
ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు, భారత జట్టు వెటరన్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా కూడా గాయానికి గురయిన సంగతి తెలిసిందే. ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులోకి వచ్చినా.. టోర్నీలో ఆడగలడా లేదా అనే సందేహం నెలకొంది. మహ్మద్ షమీ విషయంలో టీమ్ మేనేజ్‌మెంట్ చాలా జాగ్రత్తలు తీసుకోవడానికి బహుశా ఇదే కారణంగా నిలుస్తోంది. ఎందుకంటే బుమ్రా తర్వాత షమీ కూడా ఔట్ అయితే భారత జట్టు బౌలింగ్ చాలా బలహీనంగా మారుతుంది. ఇతర బౌలర్లకు సత్తా ఉంది. కానీ, బుమ్రా, షమీకి ఉన్నంత అనుభవం లేదు. తద్వారా ఒత్తిడిలో మెరుగ్గా రాణించలేరు.