Shubman Gill: ఒక్క సెంచరీతో ధావన్‌, రాహుల్, కోహ్లీని దాటేసిన గిల్.. అత్యంత వేగవంతమైన భారత క్రికెటర్‌గా రికార్డ్‌..

|

Sep 26, 2023 | 4:00 PM

IND vs AUS: భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన రెండో వన్డేలో టీమిండియా 99 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇక ఈ వన్డే మ్యాచ్‌ ద్వారా శ్రేయాస్ అయ్యర్ 3వ సెంచరీని, శుభమాన్ గిల్ 6వ సెంచరీని నమోదు చేసుకున్నారు. అయితే తన 6వ సెంచరీ ద్వారా గిల్ అరుదైన లిస్టులో అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఈ క్రమంలో అతను శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్ వంటి ప్రేయర్లను కూడా అధిగమించాడు. ఇంతకీ గిల్ సాధించిన ఆ ఘనత ఏమిటంటే..?

1 / 5
Shubman Gill: ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో సెంచరీ చేసిన శుభమాన్ గిల్, భారత్ తరఫున అత్యంత వేగంగా 6 శతకాలను పూర్తి చేసుకున్న ఆటగాడిగా అవతరించాడు.

2 / 5
నిజానికి ఈ రికార్డ్ గతంలో శిఖర్ ధావన్ పేరిట ఉండేది. ధావన్ 46 వన్డే ఇన్నింగ్స్‌ల్లోనే 6 సెంచరీలను నమోదు చేయగా.. గిల్ 35వ వన్డే ఇన్నింగ్స్‌లోనే ఈ ఫీట్‌ని అందుకున్నాడు.

3 / 5
అంటే అత్యంత వేగంగా 6 వన్డే శతకాలను పూర్తి చేసుకున్న భారత ఆటగాడిగా గిల్ ఇప్పుడు అగ్రస్థానం నిలవగా.. ధావన్ రెండో స్థానానికి దిగాడు.

4 / 5
ఇక ఈ లిస్టు మూడో స్థానంలో కేఎల్ రాహుల్(53 వన్డే ఇన్నింగ్స్) ఉండగా.. విరాట్ కోహ్లీ (61 ఇన్నింగ్స్), గౌతమ్ గంభీర్(68) వరుసగా 4, 5 స్థానాల్లో ఉన్నారు.

5 / 5
కాగా, ఆదివారం జరిగిన మ్యాచ్‌లో అయ్యర్(105), గిల్(104) సెంచరీలతో.. కేఎల్ రాహుల్(52), సూర్య కుమార్ యాదవ్(72*) అర్థసెంచరీలతో రాణించారు. అలాగే బౌలింగ్‌లో రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా చెరో 3 వికెట్లతో మెరిశారు. దీంతో భారత్ రెండో వన్డేలో కూడా విజయం సాధించి, మరో మ్యాచ్ ఉండగానే వన్డే సిరీస్‌ని 2-0 తేడాతో కైవసం చేసుకుంది.