- Telugu News Photo Gallery Cricket photos IND Vs AUS 4th T20i Indian bowler Axar Patel Became The 2nd Leading Wicket Taker In Ind Vs Aus T20I series
IND vs AUS: ఆస్ట్రేలియాను వణికించిన అక్షర్ పటేల్.. 2వ భారత బౌలర్‌గా రికార్డ్..
IND vs AUS, Axar Patel: నాలుగో టీ20 మ్యాచ్‌లో లెఫ్టార్మ్ స్పిన్నర్ అక్షర్ పటేల్ 4 ఓవర్లలో 16 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. ఈ మూడు వికెట్లతో భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన టీ20 ఇంటర్నేషనల్స్‌లో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా అక్షర్ పటేల్ నిలిచాడు.
Updated on: Dec 02, 2023 | 2:58 PM

రాయ్‌పూర్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన 4వ టీ20 మ్యాచ్‌లో టీమిండియా 20 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో సిరీస్‌ను 3-1 తేడాతో కైవసం చేసుకుంది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు ఆస్ట్రేలియాకు 175 పరుగుల లక్ష్యాన్ని అందించింది. జట్టు తరపున జైస్వాల్ 37 పరుగుల ఇన్నింగ్స్ ఆడగా, గైక్వాడ్ కూడా 32 పరుగులు చేశాడు. వీరిద్దరి తర్వాత రింకు 29 బంతుల్లో 46 పరుగులు చేయగా, జితేష్ శర్మ 19 బంతుల్లో 35 పరుగులు చేశాడు.

175 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా జట్టు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 154 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత్ తరపున అక్షర్ పటేల్ 3 వికెట్లు తీసి ప్రత్యేక రికార్డు సృష్టించాడు.

నాలుగో టీ20 మ్యాచ్‌లో లెఫ్టార్మ్ స్పిన్నర్ అక్షర్ పటేల్ 4 ఓవర్లలో 16 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. ఈ మూడు వికెట్లతో భారత్-ఆస్ట్రేలియా మధ్య టీ20 ఇంటర్నేషనల్స్‌లో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా అక్షర్ పటేల్ నిలిచాడు.

అక్షర్ పటేల్ ఇప్పటి వరకు ఆస్ట్రేలియాతో టీ20లో 7 మ్యాచ్‌లు ఆడి 13 వికెట్లు తీశాడు.

ప్రస్తుతం ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్న జస్ప్రీత్ బుమ్రా ఒక్కడే 16 వికెట్లు పడగొట్టాడు.

ఆస్ట్రేలియా తరపున ఆడమ్ జంపా 12 వికెట్లతో టాప్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. ఈ జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు.




