IND vs AFG: రీఎంట్రీలో ఆఫ్ఘనిస్థాన్‌పై జీరో.. కట్‌చేస్తే.. రెండు రికార్డుల్లో చేరిన రోహిత్ శర్మ..!

|

Jan 12, 2024 | 4:48 PM

IND vs AFG: ఈ మ్యాచ్‌లో, కెప్టెన్ రోహిత్ సున్నాకి ఔటయ్యాడు. తన పేరిట అరుదైన రికార్డును సృష్టించాడు. అలాగే, ఒక విషయంలో గతంలో భారత టీ20 జట్టుకు నాయకత్వం వహించిన కెప్టెన్లందరినీ అధిగమించాడు. ఈ ప్రత్యక లిస్టులో రోహిత్ శర్మ అగ్రస్థానంలో నిలిచాడు. రోహిత్ తర్వాతే, విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోని నిలిచారు. అసలేంటి ఆ ప్రత్యేక రికార్డ్, ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

1 / 7
ఈ మ్యాచ్‌లో సరిగ్గా 14 నెలల తర్వాత భారత టీ20 జట్టులోకి తిరిగి వచ్చిన కెప్టెన్ రోహిత్ శర్మ ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు. దీంతో భారత్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. అయితే, ప్రస్తుతం భారత్ బ్యాటింగ్‌ చేస్తోంది.

2 / 7
ఈ మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ సున్నాకి అవుటయ్యాడు. తన పేరిట అరుదైన రికార్డును సృష్టించాడు. అలాగే, ఒక విషయంలో గతంలో భారత టీ20 జట్టుకు నాయకత్వం వహించిన కెప్టెన్లందరినీ అధిగమించాడు.

3 / 7
14 నెలల తర్వాత టీ20లో భారత కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన రోహిత్ శర్మ.. ఇప్పుడు టీ20లో భారత జట్టుకు సారథ్యం వహించిన అతి పెద్ద వయసు కెప్టెన్‌గా నిలిచాడు. రోహిత్ 36 ఏళ్ల 256 రోజుల వయసులో భారత జట్టు బాధ్యతలు చేపట్టాడు.

4 / 7
దీంతో శిఖర్ ధావన్ రికార్డును రోహిత్ బద్దలు కొట్టాడు. ఇంతకు ముందు శిఖర్ ధావన్ భారత టీ20 జట్టుకు అత్యంత సీనియర్ కెప్టెన్. 35 ఏళ్ల 236 రోజుల పాటు భారత టీ20 జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు.

5 / 7
అలాగే, 35 ఏళ్ల 52 రోజుల పాటు భారత టీ20 జట్టుకు నాయకత్వం వహించిన ఎంఎస్ ధోనీ.. 33 ఏళ్ల 3 రోజుల పాటు భారత టీ20 జట్టుకు నాయకత్వం వహించిన విరాట్ కోహ్లీని అధిగమించాడు.

6 / 7
దీంతో పాటు భారత్ తరపున అత్యధిక టీ20 మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా రోహిత్ శర్మ రికార్డు సృష్టించాడు. భారత్ తరపున రోహిత్ ఇప్పటి వరకు 149వ టీ20 మ్యాచ్‌ని ఆడుతున్నాడు.

7 / 7
115 టీ20 మ్యాచ్‌లు ఆడిన విరాట్ కోహ్లీ ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. అలాగే ఎంఎస్ ధోని 98 టీ20 మ్యాచ్‌లు ఆడగా, మరోవైపు హార్దిక్ పాండ్యా 92 టీ20 మ్యాచ్‌లు, భువనేశ్వర్ కుమార్ 87 టీ20 మ్యాచ్‌లు ఆడారు.