ICC World Cup Qualifiers 2023: 6,6,6,6,6,6.. ఏం దంచుడు సామీ.. సెంచరీతో దుమ్మురేపిన నికోలస్ పూరన్..

|

Jun 27, 2023 | 10:11 AM

ICC World Cup Qualifiers 2023: ఐసీసీ వరల్డ్ ‌కప్ క్వాలిఫైయర్స్‌ మ్యాచ్‌లో వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్ నికోలస్ పూరన్‌ దుమ్మురేపుతున్నాడు. ఇప్పటి వరకు 2 సెంచరీలో అదరగొట్టాడు. తాజాగా సెంచరీ చేసిన నికోలస్.. దీనికి ముందు నేపాల్‌పై 94 బంతుల్లో 115 పరుగులు చేసి రఫ్పాడించాడు.

1 / 6
హరారేలో జరుగుతున్న వన్డే ప్రపంచకప్ క్వాలిఫయర్స్‌ మ్యాచ్‌లో వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్ నికోలస్ పూరన్ మెరుపు సెంచరీ సాధించాడు. ఈ మ్యాచ్‌లో నెదర్లాండ్స్ జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా.. వెస్టిండీస్‌ను బ్యాటింగ్‌కు దిగింది.

2 / 6
 ఇన్నింగ్స్ ప్రారంభించిన వెస్టిండీస్‌కు బ్రెండన్ కింగ్ (76), జాన్సన్ చార్లెస్ (54) పరుగులతో ఆరంభం నుంచే అదరగొట్టారు. వారి తరువాత వచ్చిన షాయ్ హోప్, నికోలస్ పూరన్ సైతం అద్భుత ఇన్నింగ్స్ ఆడారు.

3 / 6
షాయ్ హోప్ 38 బంతుల్లో 2 సిక్సర్లు, 3 ఫోర్లతో 47 పరుగులు చేసి ఔటయ్యాడు. కానీ మరోవైపు తుఫాన్ బ్యాటింగ్ ప్రదర్శించిన పూరన్ నెదర్లాండ్స్ బౌలర్లను చుక్కలు చూపించాడు.

4 / 6
పూరన్ బ్యాటింగ్ ధాటికి నెదర్లాండ్స్ బౌలర్లు చిత్తయ్యారు. పూరన్ 6 భారీ సిక్సర్లు, 9 ఫోర్లలతో చెలరేగి ఆడాడు.

5 / 6
పూరన్ కేవలం 63 బంతుల్లోనే అద్భుతమైన సెంచరీ పూర్తి చేశాడు. 65 బంతుల్లో అజేయంగా 104 పరుగులు చేయడంతో వెస్టిండీస్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 374 పరుగులు చేసింది.

6 / 6
వన్డే ప్రపంచకప్ క్వాలిఫయర్‌లో నికోలస్ పూరన్‌కి ఇది 2వ సెంచరీ. దీనికి ముందు నేపాల్‌పై 94 బంతుల్లో 115 పరుగులు చేశాడు. ఇప్పుడు అతను నెదర్లాండ్స్‌పై 65 బంతుల్లో అజేయంగా 104 పరుగులు చేశాడు.