IND vs AUS: 0,0,0.. ఖాతా తెరవని కిషన్, రోహిత్, శ్రేయస్.. 1983 వరల్డ్ కప్ మ్యాచ్ రిపీట్?

|

Oct 08, 2023 | 8:49 PM

ICC World Cup 2023: ఆస్ట్రేలియా ఇచ్చిన చిన్న లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. తొలి రెండు ఓవర్లలోనే భారత జట్టు మూడు వికెట్లు కోల్పోయింది. ఈ ముగ్గురు సున్నాకే పెవిలియన్ చేరారు. టీమిండియా తరపున ఓపెనింగ్‌క వచ్చిన ఇషాన్ కిషన్, కెప్టెన్ రోహిత్ శర్మ ఆ తర్వాత శ్రేయాస్ అయ్యర్ ఖాతా తెరవలేకపోయారు.

1 / 8
చెన్నైలోని చెపాక్‌ వేదికగా భారత్‌-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న తొలి ప్రపంచకప్‌ సమరంలో ఈ చెత్త రికార్డ్ నమోదైంది. ఆసీస్ జట్టును తక్కువకే కట్టడి చేసిన భారత్.. లక్ష్యాన్ని ఛేదించడంలో తంటాలు పడుతోంది.

2 / 8
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ ఆస్ట్రేలియా జట్టును కేవలం 199 పరుగులకే కట్టడి చేసింది. జడేజా ఆసీస్ జట్టును ఇబ్బంది పెట్టాడు.

3 / 8
భారత బౌలర్ల ధాటికి ముందు ఆసీస్ జట్టులో ఒక్క బ్యాట్స్‌మెన్ కూడా హాఫ్ సెంచరీ ఇన్నింగ్స్ ఆడలేదు. స్మిత్, వార్నర్ మాత్రమే 40 పరుగుల మార్కును దాటారు.

4 / 8
ఆస్ట్రేలియా ఇచ్చిన స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. తొలి రెండు ఓవర్లలోనే భారత జట్టు మూడు వికెట్లు కోల్పోయింది. టీమిండియాకు ఓపెనర్లుగా వచ్చిన ఇషాన్ కిషన్, కెప్టెన్ రోహిత్ శర్మ ఆ తర్వాత శ్రేయాస్ అయ్యర్ కూడా ఖాతా తెరవలేకపోయారు.

5 / 8
తొలి ఓవర్ వేసిన మిచెల్ స్టార్క్ ఆ ఓవర్ 4వ బంతికి వికెట్ తీశాడు. తన తొలి డెలివరీని ఎదుర్కొన్న కిషన్‌ ఆసీస్ బౌలర్ గ్రీన్‌కి క్యాచ్‌ ఇచ్చి ఔట్‌ అయ్యాడు.

6 / 8
రెండో ఓవర్ మూడో బంతికే కెప్టెన్ రోహిత్ శర్మ ఎల్బీగా ఔట్ అయ్యాడు. జోష్ హేజిల్‌వుడ్ వేసిన ఈ ఓవర్‌లో రోహిత్ ఖాతా తెరవలేకపోయాడు.

7 / 8
ఇద్దరు ఓపెనర్లు సున్నాకే వికెట్లు కోల్పోయిన తరుణంలో క్రీజులోకి వచ్చిన శ్రేయాస్ అయ్యర్ కూడా 2వ ఓవర్ చివరి బంతికి డేవిడ్ వార్నర్ చేతికి చిక్కాడు. ఈ సమయానికి భారత్ ఖాతాలో కేవలం 2 పరుగులే ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోంది.

8 / 8
1983 ప్రపంచకప్‌లోనూ టీమిండియా ఓపెనర్లు సున్నాకే పెవిలియన్ చేరారు. మరలా ఇన్నాళ్లు టీమిండియా ఓపెనర్స్ జీరోకే పెవిలియన్ చేరారు. కాగా, జింబబ్వేతో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. కపిల్ 175 స్కోర్ నమోదు చేసిన మ్యాచ్ అదే.