- Telugu News Photo Gallery Cricket photos Icc world cup 2022 meg lanning captaincy records and streak Australia women beat England Women by 71 runs and won 7th time ICC women world cup
Australia Women: ఆమె కెప్టెన్సీ అంటేనే ప్రత్యర్థులకు వణుకు.. వరల్డ్‌కప్‌లో ఒక్క మ్యాచ్‌లోనూ ఓడలే.. రికార్డులు చూస్తే దడ పుట్టాల్సిందే..
ఆదివారం మెగ్ లానింగ్ సారథ్యంలోని ఆస్ట్రేలియా జట్టు ఇంగ్లండ్‌ను ఓడించి ఐసీసీ మహిళల ప్రపంచకప్ టైటిల్‌ను ఏడోసారి గెలుచుకుంది.
Updated on: Apr 03, 2022 | 4:59 PM

లానింగ్ కెప్టెన్ అయ్యాక ఆస్ట్రేలియా ఓడిపోవడం మరిచిపోయింది. ప్రతి టోర్నీలో, ప్రతి సిరీస్‌లోనూ సత్తా చాటుతూ తన విజయాలను మరింతగా పెంచుకుంటూ దూసుకపోతోంది. ఈ క్రెడిట్ అంతా ఆసీస్ ఉమెన్స్ కెప్టెన్ మెగ్ లానింగ్‌కు చెందుతుంది. ఏడేళ్లలో, లానింగ్ టీ20 ప్రపంచకప్, ప్రపంచకప్, యాషెస్ వంటి పెద్ద ట్రోఫీలన్నింటినీ ఈ జట్టుకు అందించింది.

మహిళల క్రికెట్‌లో బలమైన, విజయవంతమైన ఆస్ట్రేలియా జట్టు ఆదివారం మరో ప్రపంచ కప్ టైటిల్‌ను గెలుచుకుంది. ఇంగ్లండ్‌ను ఓడించి ఆస్ట్రేలియా ఏడోసారి ఈ టైటిల్‌ను గెలుచుకుంది. ఈ విజయంతో ఆస్ట్రేలియా కెప్టెన్ మెగ్ లానింగ్ విజయాల జాబితాలో మరో ప్రపంచకప్ టైటిల్ చేరిపోయింది. మెగ్ లానింగ్ కెప్టెన్సీలో ఉన్న ఈ ఆస్ట్రేలియా జట్టును ఓడించడం అన్ని జట్లకు అసాధ్యంగానే మారింది.

లానింగ్ 19 సంవత్సరాల వయస్సులో AJ బ్లాక్‌వెల్ కెప్టెన్సీలో ఆమె అరంగేట్రం చేసింది. నాలుగేళ్ల తర్వాత, జట్టు కెప్టెన్సీని లానింగ్‌కు అప్పగించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు లానింగ్ కెప్టెన్సీలో 74 వన్డేలు ఆడింది. ఈ 74 మ్యాచ్‌ల్లో ఆ జట్టు 65 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, ఎనిమిదింటిలో మాత్రమే ఓటమి చవిచూడాల్సి వచ్చింది. మెగ్ లానింగ్ టీమ్ ఎందుకు విజయవంతమైందో చెప్పడానికి ఈ రికార్డులే సరిపోతాయి.

లానింగ్ కెప్టెన్సీలో ఆస్ట్రేలియా జట్టు 2020లో భారత్‌ను ఓడించి టీ20 ప్రపంచకప్ టైటిల్‌ను గెలుచుకుంది. మొత్తం క్యాంపెయిన్‌లో ఆస్ట్రేలియా జట్టు ఒకే ఒక్క ఓటమిని చవిచూసింది. ఈసారి కూడా మాగ్ లానింగ్ జట్టు ప్రపంచకప్‌లో అజేయంగా నిలిచింది. సెమీ-ఫైనల్స్, ఫైనల్స్ కాకుండా లీగ్ రౌండ్‌లోని ఏడు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించింది.




