INDW vs AUSW T20 WC: ప్రారంభమైన ఆస్ట్రేలియా, భారత్ టీ20 సెమీస్.. గెలిస్తే ఫైనల్ లేదా ఇంటికే..!

|

Feb 23, 2023 | 6:57 PM

ఐసీసీ ఉమెన్స్ టీ20 వరల్డ్‌కప్ 2023 టోర్నీలో భాగంగా టీమిండియాతో జరుగుతున్న సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న ఈ టోర్నీ ‘గ్రూప్ బీ’ లో రెండు జట్లు టాప్ 2 స్థానాల్లో ఉన్నాయి.

1 / 7
ఉమెన్స్ టీ20 వరల్డ్‌కప్ 2023 ‘గ్రూప్‌ బీ’ టాప్ 2 స్థానాలలో ఉన్న ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య ఈ రోజు సెమీ ఫైనల్ జరుగుతోంది. తొలుత టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ముందుగా బ్యాటింగ్‌ను ఎంచుకుంది.

2 / 7
మరోవైపు టీమిండియా ఆల్‌రౌండర్ పూజా వస్త్రాకర్ గాయం కారణంగా టోర్నీకి దూరం కావడంతో ఆమె స్థానంలో స్నేహ్ రాణా జట్టులోకి వచ్చింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌ కౌర్ కూడా మ్యాచ్‌కు ముందు అనారోగ్యంతో బాధపడినా.. మ్యాచ్‌లో కొనసాగుతోంది.

3 / 7
అయితే టీమిండియాపై ఆస్ట్రేలియాకి గొప్ప రికార్డు ఉంది. ఇప్పటిదాకా ఈ ఇరుజట్ల మధ్య 30 మ్యాచులు జరగగా 22 మ్యాచుల్లో ఆస్ట్రేలియానే గెలిచింది. 7 మ్యాచుల్లో భారత జట్టు గెలవగా..ఒక మ్యాచ్ ఫలితం తేలకుండానే రద్దయ్యింది.

4 / 7
ఇంకా ఉమెన్స్ టీ20 వరల్డ్‌కప్‌లో ఇప్పటి వరకూ ఐదు సార్లు భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడగా..టీమిండియా రెండు మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించింది.

5 / 7
ఈ క్రమంలో ఉమెన్స్ టీ20 వరల్డ్‌ కప్ ఫైనల్‌లో టీమిండియా ఆడాలంటే.. ఆస్ట్రేలియాతో జరుగుతున్న సెమీఫైనల్‌లో భారత్ తప్పక గెలిచి తీరాలి. ఒక వేళ ఈ మ్యాచ్ చేజారితే టీమిండియా ఇంటిబాట పట్టాల్సిందే..!

6 / 7
భారత జట్టు: షెఫాలీ వర్మ, స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), రిచా ఘోష్(వికెట్ కీపర్), దీప్తి శర్మ, యస్తికా భాటియా, స్నేహ్ రాణా, శిఖా పాండే, రాధా యాదవ్, రేణుకా ఠాకూర్ సింగ్

7 / 7
ఆస్ట్రేలియా జట్టు: అలీసా హీలి(వికెట్ కీపర్), బెత్ మూనీ, మెగ్ లానింగ్, అష్‌లీగ్ గార్నర్, ఎలీసా పెర్రీ, తహిళా మెక్‌గ్రాత్, గ్రాస్ హారీస్, జార్జియా వారెహం, జెస్ జానసెన్, మెగన్ స్కాట్, డార్సీ బ్రౌన్