
టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా, సెర్బియా బ్యూటీ నటాషా స్టాంకోవిచ్ విడాకులు తీసుకున్నారు. గత కొన్ని రోజులుగా రూమర్లుగానే ఉన్న ఈ వార్తలను నిజం చేస్తూ సోషల్ మీడియా ద్వారా 4 సంవత్సరాల వివాహా బంధానికి వీడ్కోలు పలికారు హార్దిక్, నటాషా.

' ఇద్దరమూ పరస్పర అంగీకారంతో విడిపోతున్నామని, తమ గోప్యతకు ప్రాధాన్యమివ్వాలని' సోషల్ మీడియా పోస్టులో కోరారు హార్దిక్, నటాషా.

ఇదిలా ఉంటే నటాషాతో విడాకుల తర్వాత హార్దిక్ పాండ్యా బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ అనన్యా పాండేతో డేటింగ్ చేస్తున్నాడన్న రూమర్లు పుట్టుకొచ్చాయి.

ఇటీవల అనంత్ అంబానీ- రాధికల పెళ్లి వేడుకల్లో హార్దిక్ పాండ్యాతో కలిసి చిందులు వేసింది అనన్యా పాండే. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పెద్దఎత్తున వైరలైంది.

ఈ పెళ్లి తర్వాత అనన్య పాండే సోషల్ మీడియాలో హార్దిక్ పాండ్యాను ఫాలో అవుతోంది. హార్దిక్ పాండ్యా సైతం అనన్యను ఫాలో అవుతున్నాడు.

అనన్య సైతం తన బాయ్‌ఫ్రెండ్ ఆదిత్య రాయ్ కపూర్‌లో బ్రేకప్ చేసుకుంది. ఈ నేపథ్యంలోనే హార్దిక్, అనన్యా ఒకరినొకరు ఫాలో చేసుకోవడంతో డేటింగ్ పుకార్లు షికార్లు చేస్తున్నాయి.