ఊరమాస్ ఇన్నింగ్స్‌లకు కేరాఫ్ అడ్రస్.. భారీ సిక్సులతో భీభత్సానికి బ్రాండ్ అంబాసిడర్లు వీరే.. లిస్టులో ఇద్దరు మనోళ్లే

|

Apr 15, 2024 | 12:05 PM

IPL 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 17లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాట్స్‌మెన్ టాప్-3 జాబితాలో ఏకైక భారతీయ బ్యాట్స్‌మెన్ ఉన్నాడు. ఆర్‌సీబీ తరపున అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాట్స్‌మెన్లలో విరాట్ కోహ్లీ మొదటి స్థానంలో ఉన్నాడు. కింగ్ కోహ్లీ గత 6 ఇన్నింగ్స్‌ల్లో మొత్తం 12 సిక్సర్లు బాదాడు.

1 / 6
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2024) సీజన్ 17లో నికోలస్ పూరన్ హావా కొనసాగుతోంది. లక్నో సూపర్ జెయింట్స్ తరపున మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేస్తున్న పూరన్ ఇప్పుడు సిక్స్ హిట్టర్ల జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు.

2 / 6
కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 6వ స్థానంలో వచ్చిన నికోలస్ పూరన్ 32 బంతుల్లో 4 భారీ సిక్సర్లు, 2 ఫోర్లతో 45 పరుగులు చేశాడు. ఈ నాలుగు సిక్సర్లతో ఈ ఐపీఎల్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాట్స్‌మెన్ జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు. మరి ఈసారి అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాట్స్‌మెన్ ఎవరో ఓసారి చూద్దాం..

3 / 6
1- నికోలస్ పూరన్: ఐపీఎల్ 2024లో పూరన్ ఇప్పటివరకు 6 మ్యాచ్‌ల్లో మొత్తం 138 బంతులు ఎదుర్కొన్నాడు. ఈక్రమంలో 19 భారీ సిక్సర్లు, 10 ఫోర్లు కొట్టాడు.

4 / 6
2- రియాన్ పరాగ్: రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడుతున్న రియాన్ పరాగ్ 6 మ్యాచ్‌ల్లో 183 బంతులు ఎదుర్కొని 18 సిక్సర్లు బాదాడు.

5 / 6
3- హెన్రిక్ క్లాసెన్: ఈ జాబితాలో మూడవది హెన్రిక్ క్లాసెన్. సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేస్తున్న క్లాసన్ 5 మ్యాచ్‌ల్లో 96 బంతులు ఎదుర్కొని 17 సిక్సర్లు కొట్టాడు.

6 / 6
4- అభిషేక్ శర్మ: సన్‌రైజర్స్ హైదరాబాద్ యువ స్ట్రైకర్ అభిషేక్ శర్మ ఈ జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నాడు. ఐదు మ్యాచ్‌ల్లో 85 బంతులు ఎదుర్కొన్న అభిషేక్.. ఇప్పటివరకు 16 సిక్సర్లు బాదాడు.