
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2024) సీజన్ 17లో 18 మ్యాచ్‌లు ముగిసే సమయానికి ప్లేయర్స్ 300కు పైగా సిక్సర్లు కొట్టారు. ఇందులో అత్యధిక సిక్సర్లు బాదిన సన్‌రైజర్స్ హైదరాబాద్ తుఫాన్ బ్యాట్స్‌మెన్ హెన్రిక్ క్లాసెన్ నిలిచాడు.

అలాగే, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి ఫోర్ల సంఖ్యలో అగ్రస్థానంలో నిలవడం విశేషం. మరి 18 మ్యాచ్‌లు ముగిసే సమయానికి అత్యధిక బౌండరీలు బాదిన బ్యాట్స్‌మెన్ ఎవరో చూద్దాం..

1- హెన్రిక్ క్లాసెన్: సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున మిడిల్ ఆర్డర్‌లో ఆడే హెన్రిక్ క్లాసెన్ ఇప్పటివరకు 4 ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఈ సమయంలో 17 సిక్సర్లతో ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు.

2- అభిషేక్ శర్మ: సన్‌రైజర్స్ హైదరాబాద్ యువ ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్ అభిషేక్ శర్మ 4 ఇన్నింగ్స్‌లలో మొత్తం 15 సిక్సర్లు కొట్టి ఈ జాబితాలో రెండవ స్థానంలో ఉన్నాడు.

1- విరాట్ కోహ్లీ: ఈ ఐపీఎల్‌లో విరాట్ కోహ్లీ ఇప్పటివరకు 4 ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఈ క్రమంలో 17 ఫోర్లు బాదాడు. దీంతో అత్యధిక ఫోర్లు బాదిన బ్యాటర్ల జాబితాలో మొదటి స్థానంలో నిలిచాడు.

2- శిఖర్ ధావన్: పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్ ఇప్పటివరకు 4 ఇన్నింగ్స్‌ల్లో బ్యాటింగ్ చేసి మొత్తం 16 ఫోర్లు కొట్టాడు. ఈ జాబితాలో ఇది రెండో స్థానంలో నిలిచాడు.