
Virat Kohli Retirement: భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మే 12న ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా టెస్ట్ ఫార్మాట్‌కు వీడ్కోలు పలికి క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన సంగతి తెలిసిందే. కింగ్ కోహ్లీ 2011లో వెస్టిండీస్‌పై టెస్ట్ అరంగేట్రం చేశాడు. జనవరి 2025లో ఆస్ట్రేలియాపై తన చివరి టెస్ట్ ఆడాడు. గత 14 సంవత్సరాలలో, ఈ కుడిచేతి వాటం స్టార్ బ్యాట్స్‌మన్ 123 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి, 46.85 సగటుతో 9,230 పరుగులు చేశాడు. టెస్ట్ క్రికెటర్‌గా తన కెరీర్‌లో 30 సెంచరీలు, 31 అర్ధ సెంచరీలు సాధించాడు.

కోహ్లీ ఈ ఫార్మాట్‌లో మరికొన్ని సంవత్సరాలు ఆడటం కొనసాగిస్తాడని అభిమానులు ఆశించారు. కానీ, రోహిత్ శర్మ టెస్ట్‌ల నుంచి రిటైర్ అయిన 5 రోజుల తర్వాత కోహ్లీ కూడా రిటైర్మెంట్ ప్రకటించాడు. కోహ్లీ కంటే ముందు టెస్ట్ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన చాలా మంది భారతీయ ఆటగాళ్ళు ఉన్నారు. కానీ, ఇందులో కొంతమంది ఇంకా రిటైర్మెంట్ ప్రకటించలేదని తెలిస్తే కచ్చితంగా ఆశ్చర్యపోతారు. అలాంటి ఆటగాళ్లు ముగ్గురు ఉన్నారు.

1. జయదేవ్ ఉనద్కద్: జయదేవ్ ఉనద్కట్ ఇప్పటివరకు నాలుగు టెస్ట్ మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. కానీ, అతను విరాట్ కోహ్లీ కంటే ముందే టెస్ట్ అరంగేట్రం చేశాడు. 2010లో సూపర్‌స్పోర్ట్ పార్క్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌కు ముందు ఉనద్కద్ తన తొలి టెస్ట్ క్యాప్‌ను అందుకున్నాడు. ఈ ఎడమచేతి వాటం పేసర్ తన తొలి మ్యాచ్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. త్వరలోనే జట్టులో తన స్థానాన్ని కోల్పోయాడు. సంవత్సరాల తరబడి కష్టపడి పనిచేసిన తర్వాత, 2022 చివర్లో బంగ్లాదేశ్‌తో జరిగే సిరీస్ కోసం ఉనద్కద్ చివరకు భారత టెస్ట్ జట్టులోకి తిరిగి వచ్చాడు. 2023లో వెస్టిండీస్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో కూడా ఉనద్కద్ ఆడాడు. విరాట్ కంటే ముందే ఉనద్కట్ టెస్ట్ అరంగేట్రం చేశాడు. ఇంకా రిటైర్ కాలేదు. కానీ, విరాట్ కెప్టెన్సీలో అతనికి టెస్ట్ ఆడే అవకాశం ఎప్పుడూ రాలేదు.

2. చెతేశ్వర్ పుజారా: ఈ జాబితాలో మరో అనుభవజ్ఞుడైన భారత క్రికెటర్ చతేశ్వర్ పుజారా కూడా ఉన్నారు. ఇషాంత్ శర్మ లాగే, విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో భారతదేశం సాధించిన అనేక విదేశీ విజయాలలో పుజారా కీలక పాత్ర పోషించాడు. పుజారా ఇప్పటివరకు భారత్ తరపున 103 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు. అతను 3 డబుల్ సెంచరీలు, 19 సెంచరీలు, 35 అర్ధ సెంచరీలతో సహా 7,195 పరుగులు చేశాడు. పుజారా తన తొలి టెస్ట్ మ్యాచ్‌ను 2010లో న్యూజిలాండ్‌తో ఎం. చిన్నస్వామి స్టేడియంలో ఆడాడు. అతని చివరి మ్యాచ్ 2023లో ఇంగ్లాండ్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన WTC ఫైనల్ ఆడాడు. పుజారా వ్యాఖ్యాతగా పనిచేయడం ప్రారంభించాడు. కానీ, అతను ఇప్పటికీ రెడ్-బాల్ టోర్నమెంట్‌లలో చురుగ్గా ఉన్నాడు.

3. ఇషాంత్ శర్మ: విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో విదేశాల్లో ఆధిపత్యం చెలాయించిన ఇషాంత్ శర్మ.. భారత టెస్ట్ జట్టులో కీలక పాత్ర పోషించాడు. ఈ కుడిచేతి వాటం ఫాస్ట్ బౌలర్ మొత్తం 105 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి 311 వికెట్లు పడగొట్టాడు. ఈ కాలంలో, అతను 11 సార్లు ఐదు వికెట్లు, ఒకసారి (ఒక మ్యాచ్‌లో) 10 వికెట్లు పడగొట్టడంలో విజయం సాధించాడు. ఇషాంత్ తన టెస్ట్ కెరీర్‌ను 2008లో ఆస్ట్రేలియాపై ప్రారంభించాడు. అతను తన చివరి టెస్ట్ మ్యాచ్‌ను నవంబర్ 2021లో న్యూజిలాండ్‌తో ఆడాడు. అప్పటి నుంచి అతను జట్టులోకి తిరిగి రాలేదు.