
టీ20 క్రికెట్‌లో అత్యంత ప్రసిద్ధిగాంచిన టోర్నమెంట్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికే 15 ఎడిషన్లు విజయవంతంగా ముగిశాయి. ప్రస్తుతం IPL 2023 జరుగుతోంది. ఈ టోర్నీలో పలువురు క్రికెట్ దిగ్గజాలు పాల్గొన్నారు.

సచిన్ టెండూల్కర్, రికీ పాంటింగ్, గ్లెన్ మెగ్‌గ్రాత్, షేన్ వార్న్, ఆడమ్ గిల్‌క్రిస్ట్, సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్ వంటి ఎందరో ప్రముఖ ఆటగాళ్లు ఐపీఎల్‌లో ఆడారు.

ఐపీఎల్‌లో చాలా మంది ఆల్‌రౌండర్లు కనిపించారు. కీరన్ పొలార్డ్, ఆండ్రూ రస్సెల్, సునీల్ నరైన్, బ్రావో, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా వంటి ఎందరో ఆల్ రౌండర్లు ఐపీఎల్‌లో పేరు పొందారు. అయితే, విరాట్ కోహ్లిని మాత్రం ఓ ఆటగాడు ఆకట్టుకున్నాడో తెలుసా?

ఐపీఎల్ చరిత్రలో అత్యుత్తమ ఆల్ రౌండర్ ఎవరో విరాట్ కోహ్లీ తేల్చేశాడు. ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ.. నా ప్రకారం RCB మాజీ ఆటగాడు షేన్ వాట్సన్ IPL గొప్ప ఆల్ రౌండర్ అంటూ తేల్చేశాడు.

షేన్ వాట్సన్ 2016, 2017 సీజన్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడాడు. అతను 2020లో IPL నుంచి రిటైర్ అయ్యాడు.

సునీల్ నరైన్, రషీద్ ఖాన్‌లలో రషీద్ అత్యుత్తమ స్పిన్నర్ అంటూ బదులిచ్చారు. నాకు టీ20 క్రికెట్‌లో పుల్ షాట్ అంటే ఇష్టం. చెన్నై సూపర్ కింగ్స్‌తో ఆడడమంటే నాకు చాలా ఉత్సాహం అంటూ కోహ్లీ పేర్కొన్నాడు.