T20 Cricket: ధోని ప్రపంచ రికార్డును బ్రేక్ చేసిన ఆసీస్ ఉమెన్ ప్లేయర్.. టీ20 ఫార్మాట్‌కే క్వీన్‌గా మారింది.. ఆమె ఎవరంటే?

|

Sep 27, 2021 | 5:47 PM

Australian Women Cricket Team: ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ అలిస్సా హీలీ ప్రపంచంలో అత్యంత విజయవంతమైన వికెట్ కీపర్లలో ఒకరు. మహేంద్ర సింగ్ ధోనీని కూడా ఆమె అధిగమించారు.

1 / 5
ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ జట్టు వికెట్ కీపర్ అలిస్సా హీలీ.. గత సంవత్సరం ఇదే రోజున ఓ ప్రపంచ రికార్డు సృష్టించింది. ఈ రికార్డుతో ఆమె భారత లెజెండ్రీ స్టార్ వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీని కూడా అధిగమించింది.

2 / 5
గత ఏడాది ఇదే రోజున అంతర్జాతీయ క్రికెట్‌లో అతి తక్కువ మ్యాచుల్లో ఎక్కువ వికెట్లు తీసిన కీపర్‌గా హీలీ నిలిచింది. పురుషుల, మహిళల టీ 20 ఫార్మాట్‌లో అత్యధిక వికెట్లు తీసిన మహిళగా ఆమె నిలిచింది. అంతకు ముందు ఈ రికార్డు ధోని పేరు మీద ఉంది.

3 / 5
పురుషుల క్రికెట్‌లో ఎంఎస్ ధోని టీ20 ఫార్మాట్‌లో వికెట్ కీపర్‌గా 91 వికెట్లు తీసుకున్నాడు. ఇందులో 57 క్యాచ్‌లు, 34 స్టంపింగ్‌లు చేశాడు. న్యూజిలాండ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో రెండో మ్యాచ్‌లో హీలీ తన 92 వ వికెట్‌ను టీ20 ఫార్మాట్‌లో పూర్తి చేసింది. ఇందులో 42 క్యాచ్‌లు, 50 స్టంప్‌లు ఉన్నాయి.

4 / 5
మహేంద్ర సింగ్ ధోని గత ఏడాది రిటైర్మెంట్ ప్రకటించాడు. అయినప్పటికీ, హీలీ రికార్డ్ బ్రేకింగ్ ప్రదర్శన ఇంకా కొనసాగుతోంది. ఇప్పటివరకు 118 మ్యాచ్‌ల్లో 97 మంది బ్యాట్స్‌మెన్‌లను పెవిలియన్ చేర్చింది. ఇందులో 46 క్యాచ్‌లు, 51 స్టంపింగ్‌లు ఉన్నాయి.

5 / 5
అదే సమయంలో 118 టీ20 మ్యాచ్‌లలో 103 ఇన్నింగ్స్‌లలో 2121 పరుగులు చేసింది. ఈ సమయంలో ఆమె అత్యధిక స్కోరు 148 నాటౌట్‌గా నమోదైంది. 82 వన్డేలలో 71 ఇన్నింగ్స్‌ల్లో 33.98 సగటుతో 2039 పరుగులు చేసింది. ఇందులో మూడు సెంచరీలు, 13 అర్ధ సెంచరీలు ఉన్నాయి.