- Telugu News Photo Gallery Cricket photos Australia star player David Warner joined Most International Hundreds Among Active Players after virat kohli
David Warner: సెంచరీతో పాక్ బౌలర్లను చితక్కొట్టిన వార్నర్.. కట్‌చేస్తే.. ప్రపంచంలోనే 2వ ప్లేయర్‌గా భారీ రికార్డ్..
Australia vs Pakistan, 1st Test: డేవిడ్ వార్నర్ తాజాగా పాక్‌పై సాధించిన సెంచరీతో అంతర్జాతీయ క్రికెట్‌లో చురుకైన బ్యాట్స్‌మెన్‌ల జాబితాలో అత్యధిక సెంచరీ చేసిన ప్రపంచంలో 2వ ప్లేయర్గా నిలిచాడు. ఈ జాబితాలో కింగ్ కోహ్లీ అగ్రస్థానంలో ఉండడం విశేషం.
Updated on: Dec 15, 2023 | 9:08 AM

పెర్త్ వేదికగా పాకిస్థాన్‌తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో డేవిడ్ వార్నర్ భారీ సెంచరీ సాధించాడు. ఈ మ్యాచ్ లో ఓపెనర్ గా బరిలోకి దిగిన వార్నర్ 125 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు.

ఈ సెంచరీతో అంతర్జాతీయ క్రికెట్‌లో చురుకైన బ్యాట్స్‌మెన్‌ల జాబితాలో అత్యధిక సెంచరీలు చేసిన ప్రపంచంలో 2వ ప్లేయర్గా నిలిచాడు. ఈ జాబితాలో కింగ్ కోహ్లీ అగ్రస్థానంలో ఉండడం విశేషం.

ఆస్ట్రేలియా ఆటగాడు డేవిడ్ వార్నర్ ఇప్పటివరకు 458 ఇన్నింగ్స్‌లు ఆడి మొత్తం 49 అంతర్జాతీయ సెంచరీలు చేసి ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు.

ఇంగ్లండ్ స్టార్ బ్యాట్స్‌మెన్ జో రూట్ మొత్తం 437 ఇన్నింగ్స్‌ల్లో 46 సెంచరీలు సాధించి యాక్టివ్ బ్యాట్స్‌మెన్ జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు.

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ 482 ఇన్నింగ్స్‌ల ద్వారా మొత్తం 45 అంతర్జాతీయ సెంచరీలు సాధించి ఈ జాబితాలో 4వ స్థానంలో ఉన్నాడు.

ఈ జాబితాలో ఆస్ట్రేలియా టెస్ట్ స్పెషలిస్ట్ స్టీవ్ స్మిత్ ఐదో స్థానంలో ఉన్నాడు. స్మిత్ మొత్తం 373 ఇన్నింగ్స్‌లు ఆడి 44 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు.




