Asia Cup 2022: ఫాం కోసం ఒకరు.. అడ్డుగోడలా మరొకరు.. ఆసియా కప్‌లో వీరి ఆటపై ఓ కన్నేయాల్సిందే..

|

Aug 22, 2022 | 10:19 AM

ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్ సన్నాహకానికి అన్ని జట్లు ఆగస్టు 27న ప్రారంభం కానున్న ఆసియాకప్‌ను కీలకంగా భావిస్తున్నాయి.

1 / 5
భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఈ ఆసియా కప్ చాలా కీలకం. దాదాపు నెల రోజుల తర్వాత రీఎంట్రీ చేస్తున్న కోహ్లీ ఆటతీరుపైనే అందరి దృష్టి ఉంది. విరామానికి ముందు కోహ్లి చాలా కష్టపడ్డాడు. ఆస్ట్రేలియాతో జరిగే టీ20 ప్రపంచకప్‌నకు ముందు ఆసియా కప్ ఈ టీమిండియా స్టార్‌కు చాలా కీలకమైనది. ఐపీఎల్‌లో 16 మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ కేవలం 341 పరుగులే చేశాడు. దీంతో కోహ్లీపై చాలా ఒత్తిడి నెలకొంది. ఆసియా కప్‌తో తన పాత ఫాంలోకి రావాలని ఆయన కోరుకుంటున్నాడు.

2 / 5
ఈ టోర్నీలో పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు. ఇటీవలి పాకిస్థాన్ జట్టు విజయాల్లో బ్యాట్స్‌మెన్‌గా కూడా చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాడు. మహ్మద్ రిజ్వాన్‌తో అతని ఓపెనింగ్ జోడీ ప్రతి జట్టుకు ఒక పీడకలలా మిగులుతోంది. టీ20 ఫార్మాట్‌లో 2686 పరుగులు చేసిన బాబర్ ఈసారి జట్టును మూడో టైటిల్‌ అందించాలనుకుంటున్నాడు.

3 / 5
ఆసియా కప్ 2022లో భారత్ తరపున సూర్యకుమార్ యాదవ్ అతిపెద్ద మ్యాచ్ విన్నర్‌గా నిరూపించుకోగలడు. ఈ టోర్నీలో ప్రత్యర్థి జట్లకు పీడకలగా మారవచ్చు. ప్రస్తుతం అంతర్జాతీయ ర్యాంకింగ్స్‌లో రెండో ర్యాంక్‌లో ఉన్నాడు. ఐపీఎల్‌లో కూడా ఆకట్టుకున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో అతనిపై టీమ్ ఇండియా చాలా ఆశలు పెట్టుకుంది.

4 / 5
టాప్ ఆర్డర్‌లో కీలక పాత్ర పోషించనున్న ఆఫ్ఘనిస్థాన్ జట్టు స్టార్ బ్యాట్స్‌మెన్ హజ్రతుల్లా జజాయ్‌పై అందరి దృష్టి ఉంది. 28 మ్యాచ్‌ల్లో 867 పరుగులు చేసిన అతను ఇప్పుడు ఈ ఫార్మాట్‌లో 1000 పరుగులకు చేరువలో ఉన్నాడు. ఆఫ్ఘనిస్తాన్ జట్టు టైటిల్ పోటీదారు కాకపోవచ్చు. కానీ జజాయ్‌ను జట్లు తేలికగా తీసుకోలేవు.

5 / 5
ఈ ఏడాది భారత్, శ్రీలంక పర్యటనలో దినేశ్ చండిమాల్ టీ20ల్లో అదరగొట్టాడు. అయితే ఆ తర్వాత అతడిని జట్టు నుంచి తప్పించారు. గత కొన్ని సిరీస్‌లలో, అతను ఆస్ట్రేలియా, పాకిస్తాన్‌లతో జరిగిన టెస్ట్ క్రికెట్‌లో అద్భుతమైన ఆటను కనబరిచాడు. అందుకే ఆసియా కప్‌లో పునరాగమనం చేస్తున్నాడు. అతనితో మిగతా జట్లు జాగ్రత్తగా ఉండాలి.