1 / 5
Andre Russell: ఆండ్రీ రస్సెల్ గురించి తెలియని వారుండరు. ఎందుకంటే బరిలోకి దిగితే దబిడ, దిబిడ దంచేస్తుంటాడు. ఈ తుఫాన్ బ్యాటింగ్‌తోనే క్రికెట్ ప్రపంచంలోనే పేరుగాంచాడు. తాజాగా సెప్టెంబరు 18న CPL 2024లో ఆడిన ఓ మ్యాచ్‌లో ఇదే ఆటతో ఆకట్టుకున్నాడు. ట్రినిడాడ్ నైట్ రైడర్స్ తరపున ఆడుతున్న రస్సెల్ కేవలం 15 బంతుల్లోనే మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. గయానా అమెజాన్ వారియర్స్ నిర్దేశించిన 149 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రస్సెల్ చివరి వరకు నాటౌట్‌గా నిలిచాడు. 240 స్ట్రైక్ రేట్‌తో తన ఇన్నింగ్స్ ఆడిన తర్వాత, అతను తన జట్టు కోసం అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాట్స్‌మన్ మాత్రమే కాదు, అత్యధిక పరుగులు కూడా చేశాడు.