ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన బ్యాట్స్‌మెన్‌లలో ఒకరైన దక్షిణాఫ్రికా గ్రేట్ బ్యాట్స్‌మెన్ ఏబీ డివిలియర్స్ శుక్రవారం క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్‌లకు వీడ్కోలు పలికాడు. డివిలియర్స్ 2018లోనే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు, అయితే అతను ఫ్రాంచైజీ క్రికెట్‌లో ఆడుతున్నాడు. ఇందులోభాగంగా, అతను విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఆడుతున్నాడు. అతను IPL-2021లో కూడా ఆడాడు. డివిలియర్స్ 2008 నుంచి ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో తన IPL కెరీర్‌ను ప్రారంభించినప్పటికీ, నాల్గవ సీజన్‌లో అతను RCBతో బరిలోకి దిగాడు. ఈ బ్యాట్స్‌మెన్ ఐపీఎల్ కెరీర్‌ను పరిశీలిస్తే, 184 మ్యాచ్‌లు ఆడి 39.70 సగటుతో 5162 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతను మూడు సెంచరీలు, 40 అర్ధ సెంచరీలు చేశాడు. ఐపీఎల్‌లో డివిలియర్స్ టాప్-5 ఇన్నింగ్స్‌ల గురించి ఓసారి తెలుసుకుందాం.
ఐపీఎల్‌లో డివిలియర్స్ అత్యధిక స్కోరు 133 నాటౌట్‌గా నిలిచింది. అతను ముంబై ఇండియన్స్‌పై ఈ ఇన్నింగ్స్ ఆడాడు. మే 10, 2015న ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో మిస్టర్ 360 డిగ్రీలుగా పిలిచే ఈ ఆటగాడు ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించి 59 బంతుల్లో 19 ఫోర్లు, నాలుగు సిక్సర్ల సాయంతో అజేయంగా 133 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్ కారణంగా RCB ఒక వికెట్ నష్టానికి 235 పరుగులు చేసి 39 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముంబైని ఏడు వికెట్లకు 196 పరుగులకే పరిమితం చేసింది.
ఈ ఇన్నింగ్స్ తర్వాత, బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో డివిలియర్స్ 129 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. సురేశ్ రైనా సారథ్యంలోని గుజరాత్ లయన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ తొలుత బ్యాటింగ్ చేసింది. ఈ మ్యాచ్‌లో కోహ్లి, డివిలియర్స్‌లు చాలా పరుగులు చేశారు. విరాట్ కోహ్లీ 55 బంతుల్లో 109 పరుగులు చేశాడు. డివిలియర్స్ 52 బంతుల్లో 10 ఫోర్లు, 12 సిక్సర్ల సాయంతో సెంచరీ చేయడంతో ఆర్సీబీ మూడు వికెట్ల నష్టానికి 248 పరుగులు చేసింది. గుజరాజ్ జట్టు 104 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో RCB 144 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ఆర్సీబీ తరపునే డివిలియర్స్ బ్యాట్ పరుగులు చేయలేదు. ఢిల్లీ డేర్‌డెవిల్స్ తరపున ఆడుతూ తుఫాను ఇన్నింగ్ సృష్టించాడు. ఈ కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్ 23 ఏప్రిల్ 2009న చెన్నై సూపర్ కింగ్స్‌పై ఢిల్లీ తరపున ఆడుతున్నప్పుడు తన మొదటి IPL సెంచరీని సాధించాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ ఐదు వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. ఇందులో డివిలియర్స్ 105 నాటౌట్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో డివిలియర్స్ 54 బంతుల్లో ఐదు ఫోర్లు, సిక్స్‌లతో రాణించాడు.
ఈ మూడు ఇన్నింగ్స్‌ల తర్వాత ఐపీఎల్‌లో డివిలియర్స్ అత్యధిక స్కోరు 90 నాటౌట్. అతను 2018లో RCB కోసం ఆడుతున్నప్పుడు తన పాత జట్టు ఢిల్లీకి వ్యతిరేకంగా చేశాడు. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ ఐదు వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. RCB జట్టు 29 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆపై డివిలియర్స్ 39 బంతుల్లో అజేయంగా 90 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించి వెనుదిరిగాడు. ఈ ఇన్నింగ్స్‌లో డివిలియర్స్ 10 ఫోర్లు, ఐదు సిక్సర్లు బాదాడు.
డివిలియర్స్ తన బ్యాటింగ్‌తో ఆర్‌సీబీకి మరో మ్యాచ్‌ను గెలిపించాడు. ఈ మ్యాచ్ 4 మే 2014న జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఆరు వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. లక్ష్యాన్ని ఛేదించిన ఆర్సీబీ స్కోరు 10.1 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 59 పరుగులు చేసింది. ఆ తర్వాత డివిలియర్స్ బాధ్యత తీసుకుని 41 బంతుల్లో ఆరు ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో అజేయంగా 89 పరుగులు చేశాడు.