రోహిత్, కోహ్లీ కాదు.. ప్రపంచకప్ గెలవాలంటే టీమిండియాకు కావాల్సింది ఇదే..: మహ్మద్ కైఫ్

Updated on: Oct 13, 2026 | 3:22 PM

2027 Cricket World Cup: 2027 వన్డే ప్రపంచకప్ దక్షిణాఫ్రికాలో బ్యాటింగ్‌కు అనుకూల పిచ్‌లపై జరుగుతుంది. ఈ టోర్నీలో భారత్ విజయం సాధించాలంటే బౌలింగ్, ఫీల్డింగ్ పటిష్ఠం చేసుకోవాలని మహ్మద్ కైఫ్ అన్నారు. కేవలం రోహిత్, కోహ్లీపై ఆధారపడకుండా జట్టు సమష్టి ప్రదర్శన కీలకమని, 2003 ప్రపంచకప్‌ ఉదాహరణగా పేర్కొన్నారు. టోర్నీ గెలవాలంటే అన్ని విభాగాల్లో రాణించాలి.

1 / 7
2027 Cricket World Cup: 2027 వన్డే ప్రపంచకప్‌ దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా దేశాల్లో జరగనుంది. ఈ మెగా టోర్నీకి సంబంధించి భారత మాజీ బ్యాటర్ మహ్మద్ కైఫ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. దక్షిణాఫ్రికాలో గతంతో పోలిస్తే బ్యాటింగ్‌కు అనుకూలమైన పరిస్థితులు ఏర్పడ్డాయని ఆయన పేర్కొన్నాడు. ఇలాంటి పిచ్‌లపై బౌలింగ్ విభాగాల నాణ్యతే టోర్నీ విజేతను నిర్ణయించే అవకాశం ఉందని అభిప్రాయపడ్డాడు. ప్రపంచకప్‌లో కొన్ని మ్యాచ్‌లతో పాటు రెండు సెమీఫైనల్స్, ఫైనల్‌ కూడా దక్షిణాఫ్రికాలోనే జరగనున్నాయి. కేప్‌టౌన్, సెంచూరియన్, జోహన్నెస్‌బర్గ్‌ మూడు కీలక మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి.

2 / 7
‘‘దక్షిణాఫ్రికాలో పరిస్థితులు చాలా మెరుగయ్యాయి. ప్రస్తుతం బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండే పిచ్‌లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి బౌలర్లు ఆధిపత్యం చెలాయిస్తారని నేను అనుకోవడం లేదు. బ్యాటర్లు మెరుగ్గా రాణించే అవకాశం ఉంది. అందుకే మంచి బౌలింగ్ విభాగం ఉన్న జట్టే టోర్నీలో విజయవంతమవుతుంది’’ అని కైఫ్‌ పేర్కొన్నాడు.

3 / 7
భారత జట్టు ప్రపంచకప్‌ గెలవాలంటే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీపై మాత్రమే ఆధారపడటం సరిపోదని ఆయన స్పష్టం చేశాడు. ‘‘అందరి దృష్టి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీపై ఉంది. వారు తమ వంతు సహకారం అందిస్తారని భావిస్తున్నాను. భారత్ ప్రపంచకప్ గెలవాలంటే బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాలను పటిష్ఠం చేసుకోవాలి. ఈ రెండు అంశాలు చాలా కీలకం’’ అని కైఫ్‌ తెలిపాడు.

4 / 7
అయితే 2027 ప్రపంచకప్‌ సమయానికి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వయసు వరుసగా 39, 40 ఏళ్లు కానుండటంతో వీరిద్దరూ టోర్నీలో ఆడతారా అనే విషయంలో ఇప్పటికే చర్చ మొదలైంది. విదేశీ గడ్డపై ఒక్క ఆటగాడే ప్రపంచకప్‌ను గెలిపించలేడని కైఫ్‌ అభిప్రాయపడ్డాడు. ‘‘కోహ్లీ జట్టులో ప్రధాన ఆటగాడే. కానీ అతడొక్కడితోనే ప్రపంచకప్‌ గెలవడం సాధ్యం కాదు. మిగతా ఆటగాళ్లు కూడా కీలకంగా సహకరించాలి’’ అని మాజీ బ్యాటర్‌ పేర్కొన్నాడు.

5 / 7
2003 వన్డే ప్రపంచకప్‌ను ఇందుకు ఉదాహరణగా కైఫ్‌ గుర్తు చేశాడు. ఆ టోర్నీలో భారత్ ఫైనల్‌కు చేరి ఆస్ట్రేలియా చేతిలో ఓడింది. సచిన్ టెండూల్కర్ టోర్నీలో అత్యుత్తమ ఆటగాడిగా నిలిచాడు. అయితే జట్టు విజయప్రయాణంలో పలువురు ఆటగాళ్లు తమ వంతు సహకారం అందించారని కైఫ్‌ వివరించాడు.

6 / 7
‘‘సచిన్ మా ప్రధాన బ్యాటర్. కానీ ఆ ప్రపంచకప్‌లోని మ్యాచ్‌లను పరిశీలిస్తే మిగతా ఆటగాళ్లు కూడా ముఖ్యమైన పాత్ర పోషించారు. యువరాజ్ కీలక పరుగులు చేశాడు. న్యూజిలాండ్‌పై నేను అజేయ అర్ధశతకం సాధించాను. రాహుల్ ద్రవిడ్, వీరేంద్ర సెహ్వాగ్ కూడా పరుగులు చేశారు. ఇంగ్లాండ్‌పై ఆశిష్ నెహ్రా అద్భుతమైన బౌలింగ్‌తో మ్యాచ్‌ను మలుపుతిప్పాడు. జహీర్ ఖాన్ మంచి స్పెల్స్‌ వేశాడు. జవగల్ శ్రీనాథ్ మా సీనియర్ బౌలర్‌గా కీలకంగా వ్యవహరించాడు. సౌరవ్ గంగూలీ కెప్టెన్సీ కూడా అద్భుతంగా ఉంది. అందరికీ క్రెడిట్ ఇవ్వాలి’’ అని కైఫ్‌ వివరించారు.

7 / 7
2027 వన్డే ప్రపంచకప్‌ అక్టోబర్ 2న ప్రారంభం కానుంది. నవంబర్ 21న ఫైనల్‌ జరగనుంది. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా వేదికలుగా సాగే ఈ టోర్నీలో భారత్‌ టైటిల్‌ సాధించాలంటే బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్, ఫీల్డింగ్‌లోనూ సమష్టి ప్రదర్శన అవసరమని కైఫ్‌ వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి.

Loading...
Unable to load recommendations.
Follow Us