Team India Journey: 2 ఏళ్లు.. 6 టెస్ట్ సిరీస్‌లు.. 18 మ్యాచ్‌లు.. టీమిండియా WTC ఫైనల్ ప్రయాణంలో భారీ ట్విస్టులు..

|

Jun 02, 2023 | 10:00 AM

WTC Final 2023: ఈ ఎడిషన్‌లో టీమ్ ఇండియా మొత్తం 18 టెస్టులు ఆడింది. ఈ 18 మ్యాచ్‌ల్లో 10 గెలిచిన భారత్ 5 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. అయితే, ఈ ప్రయాణంలో భారత్ చివరి దాకా ఎదురుచూడాల్సి వచ్చింది. కీలక మ్యాచ్‌లో శ్రీలంక జట్టు కివీస్‌పై ఓడిపోవడంతో భారత్ ఫైనల్ చేరింది.

1 / 6
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ తొలి ఎడిషన్‌ ఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో ఓడి టైటిల్ గెలవలేకపోయిన టీమిండియా.. ఇప్పుడు వరుసగా రెండోసారి ఫైనల్లోకి ప్రవేశించింది. అయితే, టీమిండియా ఈ ప్రయాణం అంత ఈజీగా రాలేదు. పలు బలమైన జట్లను ఓడించిన రోహిత్ జట్టు మరోసారి టైటిల్ రౌండ్‌లోకి ప్రవేశించింది.

2 / 6
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ రెండో ఎడిషన్‌లో, భారత జట్టు మొత్తం 6 టెస్ట్ సిరీస్‌లు ఆడింది. ఇందులో ఒక సిరీస్‌ను మాత్రమే కోల్పోగా, మరో సిరీస్ డ్రాగా ముగిసింది. నాలుగు సిరీస్‌లను టీమిండియా కైవసం చేసుకుంది.

3 / 6
ఈ ఎడిషన్‌లో భారత జట్టు మొత్తం 18 మ్యాచ్‌లు ఆడింది. ఈ 18 మ్యాచ్‌ల్లో 10 గెలిచిన భారత్ 5 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. మిగిలిన 3 టెస్టు మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో టీమిండియా ప్రయాణం ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం..

4 / 6
న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో ఓడిపోయిన తర్వాత, అంటే ఆగస్టు 2021లో టీమ్ ఇండియా ఇంగ్లాండ్‌లో పర్యటించింది. ఇరు జట్ల మధ్య 5 టెస్టు మ్యాచ్‌ల సిరీస్ జరగాల్సి ఉంది. కానీ, అక్కడ కేవలం 4 టెస్టులు మాత్రమే జరిగాయి. సిరీస్‌లోని 5వ, చివరి టెస్టు జులై 2022కి వాయిదా పడింది. చివరకు ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌ 2-2తో సమమైంది.

5 / 6
ఆ తర్వాత డిసెంబర్ 2021లో న్యూజిలాండ్‌తో టీమ్ ఇండియా స్వదేశంలో 2 మ్యాచ్‌లు ఆడి 1-0తో సిరీస్‌ని కైవసం చేసుకుంది. టీమిండియా డిసెంబర్ 2021, జనవరి 2022 మధ్య దక్షిణాఫ్రికాలో పర్యటించింది. ఆతిథ్య జట్టుతో జరిగిన 3-మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను 1-2 తేడాతో కోల్పోయింది.

6 / 6
భారత్ మార్చి 2022లో శ్రీలంకతో స్వదేశంలో 2-టెస్టుల సిరీస్‌ని ఆడింది. సిరీస్‌ను 2-0తో క్లీన్‌స్వీప్ చేసింది. 2022 డిసెంబర్‌లో బంగ్లాదేశ్‌లో పర్యటించిన భారత్, రెండు టెస్టుల సిరీస్‌ను 2-0తో గెలుచుకుంది. ఫిబ్రవరి-మార్చి 2023లో ఆస్ట్రేలియాతో స్వదేశంలో 4-టెస్టుల బోర్డర్ గవాస్కర్ టెస్ట్ సిరీస్‌ను ఆడింది.ఈ సిరీస్‌ను 2-1తో గెలుచుకుంది.