
ఆకు కూరల్లో కొత్తి మీరను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం. బ్రేక్ ఫాస్ట్, చట్నీలు, కూరలు, బిర్యానీలు, పులావ్‌లు ఇలా ఎందులోకైనా కొత్తిమీరను ఉపయోగిస్తూ ఉంటారు. దీంతో చాలా మంది కొత్తి మీరను ఇంట్లో పెంచుకుంటూ ఉంటారు. అయితే ఇవి సరిగ్గా పెరగవు. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఇవి బాగా పెరుగుతాయి.

కొత్తి మీర మొక్కలు ఇంట్లో పెంచుకునేటప్పుడు జాగ్రత్తగానే పరిశీలిస్తూ ఉండాలి. వీటిల్లో గడి మొక్కలు, పొడి ఆకులు, కలుపు మొక్కలు వంటివి ఏమైనా వస్తే వెంటనే తొలగిస్తూ ఉండాలి. దీని వల్ల కొత్తి మీర మొక్కకు తెగుళ్లు రాకుండా ఉంటాయి.

కొత్తి మీర మొక్కకు నీరు ఎక్కువగా కావాలి. అలా అని మరీ ఎక్కువగా పెట్ట కూడదు. మితంగా పోస్తే చాలు. అదేవిధంగా గాలి, ఎండ ఎక్కువగా, తక్కువగా కాకుండా చూసుకోవాలి.

కొత్తి మీర మొక్కలు బాగా రావాలంటే.. మంచి ధనియాలను ఎంచుకోండి. ఈ ధనియాలను నాటేటప్పుడు అంగుళం, అర అంగుళం లోతులో ఉండేలా చూసుకోవాలి. అదే విధంగా విత్తనాలు అనేవి మూడు నుంచి నాలుగు అంగుళాల దూరంలో ఉండేలా చూసుకోండి.

మొక్క బాగా పెరగాలంటే.. కొడి గుడ్డు పెంకులు, ఉల్లిపాయ, కూరగాయల తొక్కలు వంటివి వేస్తూ ఉండాలి. అలాగే కొత్తిమీర మొక్క పెంచే కంటైనర్స్‌కి రంధ్రాలు ఉండేలా చూసుకోండి.