
అరటి పువ్వులో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలో రక్తం లోపాన్ని తీర్చడంలో సహాయపడుతుంది. ఈ కారణంగా రక్తహీనతతో బాధపడేవారు దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవాలి. ఇందులో ఉండే జింక్ ఎముకల నష్టాన్ని నివారిస్తుంది. ఇందులో క్వెర్సెటిన్, కాటెచిన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు ఎముకల నష్టాన్ని నివారించడంలో సహాయపడతాయి.

అరటి పువ్వులో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇవి ప్రోస్టేట్ గ్రంధి పరిమాణాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. ఇందులోని సిట్రిక్ యాసిడ్, అమినో యాసిడ్స్ ప్రోస్టేట్ గ్రంధిని సాధారణ పరిమాణానికి తీసుకువస్తాయి. అరటి పువ్వు నెఫ్రో ప్రొటెక్టివ్ యాక్టివిటీని కలిగి ఉంది. ఇది కిడ్నీ దెబ్బతినకుండా కాపాడుతుంది.

అరటి పువ్వుతో చర్మ సమస్యలకు కూడా చెక్ పెట్టొచ్చు అంటున్నారు నిపుణులు. ఇది యాంటీ హిస్టామైన్ లక్షణాలు కలిగి ఉండటం వల్ల అలెర్జీలు తగ్గించడంలో సహాయపడుతుంది. అరటి పువ్వులో తక్కువ కేలరీలు ఉండటం వల్ల బరువు తగ్గడంలో సహాయపడుతుంది.

banana flower

అంతే కాకుండా జీర్ణ సంబంధిత సమస్యలను కూడా తగ్గిస్తుంది. జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగు పరుస్తుంది. ముఖ్యంగా శరీరంలో పేరుకు పోయిన కొలెస్ట్రాల్‌ను కూడా తగ్గిస్తుంది. తద్వారా కూడా షుగర్ వ్యాధి అనేది కంట్రోల్ అవుతుంది. (NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)