Mouth Ulcers: చలి కాలంలో వచ్చే నోటి పుండ్లు.. ఇలా చెక్ పెట్టండి..

|

Nov 26, 2024 | 5:25 PM

చలి కాలంలో కామన్‌గా వచ్చే సమస్యల్లో నోటి పుండ్లు కూడా ఒకటి. ఇవి వచ్చాయంటే అంత తేలిగ్గా తగ్గవు. ఆహారం తినేందుకు కూడా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి నోట్లో ఎలాంటి చిన్న మార్పులు వచ్చినా ఈ చిట్కాలు ట్రై చేస్తే..చక్కగా పని చేస్తాయి..

1 / 5
చలి కాలంలో ఎంతో మందిని ఇబ్బంది పెట్టే సమస్యల్లో నోటి పుండ్లు కూడా ఉంటాయి. శీతా కాలంలో నోటికి సంబంధించిన సమస్యలు చాలానే ఎటాక్ చేస్తాయి. ఇలాగే నోటి పుండ్లు కూడా వస్తాయి. ఇది అంత త్వరగా తగ్గదు. కానీ ఈ ఇంటి చిట్కాలతో తగ్గించుకోవచ్చు.

2 / 5
నోటి పుండ్లను తగ్గించడంలో ఉప్పు నీరు ఎంతో చక్కగా పని చేస్తుంది. ఉప్పుతో అప్పుడప్పుడు నోటితో పళ్లను శుభ్రం చేసుకోవచ్చు. ఉప్పును నీటిలో కలిపి పుక్కిలించినా కూడా నోటి పుండ్లను తగ్గించుకోవచ్చు.

నోటి పుండ్లను తగ్గించడంలో ఉప్పు నీరు ఎంతో చక్కగా పని చేస్తుంది. ఉప్పుతో అప్పుడప్పుడు నోటితో పళ్లను శుభ్రం చేసుకోవచ్చు. ఉప్పును నీటిలో కలిపి పుక్కిలించినా కూడా నోటి పుండ్లను తగ్గించుకోవచ్చు.

3 / 5
తేనెతో కూడా నోటి పుండ్లను తగ్గించుకోవచ్చు. ఎందుకంటే ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు, యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇవి నోటి పూత, నోటిలో వచ్చే పండ్లను తగ్గిస్తుంది. పుండ్లు ఉన్న చోట తేనె రాస్తే త్వరగా కంట్రోల్ అవుతుంది.

4 / 5
నోటి పుండ్లను తగ్గించడంలో బేకింగ్ సోడా కూడా ఎఫెక్టీవ్‌గా పని చేస్తుంది. బేకింగ్ సోడా కలిపిన నీటిని పుక్కిలించినా.. బేకింగ్ సోడాను పేస్టులా చేసి పుండ్లపై రాసినా చాలా వరకు సమస్య కంట్రోల్ అవుతుంది.

నోటి పుండ్లను తగ్గించడంలో బేకింగ్ సోడా కూడా ఎఫెక్టీవ్‌గా పని చేస్తుంది. బేకింగ్ సోడా కలిపిన నీటిని పుక్కిలించినా.. బేకింగ్ సోడాను పేస్టులా చేసి పుండ్లపై రాసినా చాలా వరకు సమస్య కంట్రోల్ అవుతుంది.

5 / 5
నోటి పుండ్లను కంట్రోల్ చేయడంలో పసుపు ఎంతో చక్కగా పనిచేస్తుంది. పసుపును గోరు వెచ్చటి నీటిలో వేసి కాసేపు మరిగించి.. ఆ నీటిని నోట్లో వేసి పుక్కిలించాలి. పసుపును పేస్టులా చేసి అప్లై చేసినా మంచి ఫలితం ఉంటుంది.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)

నోటి పుండ్లను కంట్రోల్ చేయడంలో పసుపు ఎంతో చక్కగా పనిచేస్తుంది. పసుపును గోరు వెచ్చటి నీటిలో వేసి కాసేపు మరిగించి.. ఆ నీటిని నోట్లో వేసి పుక్కిలించాలి. పసుపును పేస్టులా చేసి అప్లై చేసినా మంచి ఫలితం ఉంటుంది. (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)