ఊభకాయంకు పరిష్కారం: బరువు తగ్గాలనుకునేవారు కుంకుమ పువ్వును ఉపయోగిస్తే మేలు జరుగుతుంది. దీనిలోని ఫైబర్ జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరిచి కడుపు సంబంధిత సమస్యలను పరిష్కరిస్తుంది. అలాగే ఆకలి కోరికను నియంత్రించి బరువు తగ్గేలా చేస్తుంది.
షుగర్ లెవెల్స్ కంట్రోల్: కుంకుమ పువ్వును పాలలో కలిపి తాగితే టైప్-2 మధుమేహం, ప్రీ-డయాబెటిస్ సమస్యలతో ఇబ్బంది బాధపడేవారికి మేలు జరుగుతుంది. అలాగే శరీరంలోని కొలెస్ట్రాల్ తగ్గి గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది.
చర్మ సంరక్షణ: సోరియాసిస్ సమస్యకు చెక్ పెట్టేందుకు కుంకుమపువ్వు మెరుగ్గా పనిచేస్తుందని పలు అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. ఇంకా దీనిలోని విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు చర్మంపై ముడతలు తొలగిపోవడానికి సహాయపడతాయి.
ఒత్తిడికి చెక్: కుంకుమ పువ్వు మానసిక ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది. దీనిలోని పోషకాలు జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంతో పాటు ఒత్తిడి, ఆందోళన నుంచి ఉపశమనం అందిస్తాయి.
నెలసరి నొప్పుల నుంచి ఉపశమనం: కుంకుమ పువ్వు తనలోని ఔషధ గుణాల కారణంగా ఋతుస్రావ సమయంలో కలిగే నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఇందుకోసం మీరు పాలల్లో కుంకుమ పువ్వు వేసుకొని తాగితే సరిపోతుంది.