ఆరోగ్యంతో పాటు అందాన్ని రెట్టింపు చేసే కొబ్బరి పాలు.. ఇలా వాడితే చాలు!

|

Dec 23, 2024 | 4:02 PM

కొబ్బరి, కొబ్బరి నీళ్లతో కలిగే ఆరోగ్యప్రయోజనాల గురించి దాదాపు అందరికీ తెలిసిందే. అలాగే, కొబ్బరిపాలు కూడా ఎంతో మేలు చేస్తాయంటున్నారు నిపుణులు. కొబ్బరి పాలలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. చర్మం, జుట్టు సంరక్షణలో కూడా కొబ్బరిపాలు ఎంతగానో ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు. అదేలాగో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5
కొబ్బరి పాలలో ఉండే క్యాల్షియం, మెగ్నీషియం ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతాయి. శరీరంలో రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరచడమే కాకుండా, ఇన్ఫెక్షన్ బారిన పడకుండా కాపాడుతుంది. కొబ్బరి పాలు తాగడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు తగ్గుతాయి. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. బరువును అదుపులో ఉంచుకోవడానికి కూడా కొబ్బరి పాలు బెస్ట్‌ రెమిడీ అంటున్నారు నిపుణులు.

2 / 5
కొబ్బరి పాలలో పొటాషియం, మెగ్నీషియం, ఫాస్పరస్ వంటి ఎలక్ట్రోలైట్స్ పుష్కలంగా ఉంటాయి. సాధారణ గుండె లయను నిర్వహించడానికి పొటాషియం ముఖ్యమైనది. ఆరోగ్యకరమైన కండరాల పనితీరుకు ఇది ముఖ్యం. కొబ్బరి పాలలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. కొబ్బరి పాలను తీసుకోవడం ద్వారా ఎక్కువ సేపు మీ కడుపు నిండినట్లు అనిపిస్తుంది. దీంతొ మీరు అతిగా తినకుండా ఉంటారు.

3 / 5
కొబ్బరి పాలలో లారిక్ యాసిడ్ ఉంటుంది. ఇది క్రిమినాశక లక్షణాలకు ప్రసిద్ధి చెందింది. ఇది బాక్టీరియా, వైరస్, శిలీంధ్రాల వల్ల కలిగే ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి శరీరానికి సహాయపడుతుంది. కొబ్బరి పాలలో మంచి మొత్తంలో ఐరన్‌ ఉంటుంది. ఇది సాధారణ హిమోగ్లోబిన్ స్థాయిలతో ఆరోగ్యకరమైన ఎర్ర రక్త కణాల ఏర్పాటులో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. తరచూ కొబ్బరి పాలను తీసుకోవటం వలన శరీరంలో రక్తహీనతను నివారిస్తుంది.

4 / 5
 జుట్టు సమస్యలను దూరం చేయడంలో కొబ్బరిపాలు ఎంతో ఎఫెక్టివ్​గా పనిచేస్తాయని నిపుణులు చెబుతున్నారు. కొబ్బరి పాలలో పోషకాలు జుట్టు రాలడం, చుండ్రు సమస్యలను తగ్గించి ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. ఇందుకోసం కొబ్బరిపాలను స్కాల్ప్, జుట్టుకు స్మూత్​గా మసాజ్ చేయాలి. 30 నిమిషాలు అలాగే ఉంచి ఆపై తేలికపాటి షాంపూతో తలస్నానం చేస్తే సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు.

5 / 5
కొబ్బరిపాలలో గుణాలు జీర్ణ ఆరోగ్యానికి తోడ్పడతాయి. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి సహాయపడతాయి. అలాగే.. వీటిలో ఉండే యాంటీవైరల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు శరీరాన్ని ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడడంలో హెల్ప్ చేస్తాయి. ఇందుకోసం డైలీ ఒక గ్లాసు కొబ్బరి పాలను తాగడం లేదా డైలీ వంటలలో యాడ్ చేసుకుంటే సరిపోతుందంటున్నారు నిపుణులు.