రక్తహీనతకు చెక్ పెట్టె పాతకాలపు పచ్చడి.. ఇది తింటేబ్లడ్ పెరగడం పక్కా..

Updated on: May 03, 2026 | 7:16 PM

Healthy side dish for energy and immunity: రక్తహీనతకు చెక్ పెట్టె పాతకాలపు ఈ పచ్చడి వేడి అన్నంలో తింటే ప్రతి ముద్ద అమృతమే. మీరు చేసేటప్పుడే టేస్ట్ చూడకుండా ఉండలేరు. ఇంకా సువాసనతో అదిరిపోతోంది. మీరు కూడా మీ ఇంట్లో తప్పక ట్రై చేయండి.

1 / 5
కావాల్సిన పదార్దాలు : ఒక కప్పు క్యారెట్ ముక్కలు, ఒక కప్పు కొబ్బరి ముక్కలు, పచ్చిమిర్చి, ఒక కప్పు శనగపప్పు పుట్నాలు,  వెల్లుల్లి , రుచికి తగినంత ఉప్పు, చింతపండు, రెండు టేబుల్ స్పూన్స్  నిమ్మరసం, ఒక గ్లాస్ నీళ్ళు, ఒక టేబుల్ స్పూన్ నూనె, అర టేబుల్ స్పూన్ ఆవాలు,  జీలకర్ర,  నాలుగు ఎండుమిర్చి , అర కట్ట కొత్తిమీర, కరివేపాకును తీసుకోవాలి.

2 / 5
ముందుగా క్యారెట్ ముక్కలు, కొబ్బరి ముక్కలు, పచ్చిమిర్చిని  తీసుకుని వాటిని నూనెలో బాగా మగ్గించుకోవాలి. ఇంకా  దీనిలో ఒక టీ స్పూన్ కారం,  పుట్నాలు, వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు,  చింతపండును కూడా తీసుకోవాలి. ఇవి దీనిలో వేసి ఆ  తర్వాత నీరును జోడించి మిక్సీలో బాగా గ్రైండ్ చేసుకోవాలి.

3 / 5
ఆ తర్వాత దీనిలో కొంచం నీరు పోసి వాటిని ఇంకోసారి మంచిగా తిప్పుకోవాలి. అయితే, ఇంకా పచ్చడి మరి జోరుగా ఉండేలా
చూసుకోకండి. కొంచం గట్టిగా ఉండేలా ఉంటే తినడానికి కూడా మంచిగా ఉంటుంది. ఇలా చేస్తే ఇడ్లీ, దోసెల్లోకి అదిరిపోతోంది. 
ఇప్పుడు పోపు కోసం గ్యాస్  మీద మీద పాన్ పెట్టి, దానిలో నూనె వేయాలి.

ఆ తర్వాత దీనిలో కొంచం నీరు పోసి వాటిని ఇంకోసారి మంచిగా తిప్పుకోవాలి. అయితే, ఇంకా పచ్చడి మరి జోరుగా ఉండేలా చూసుకోకండి. కొంచం గట్టిగా ఉండేలా ఉంటే తినడానికి కూడా మంచిగా ఉంటుంది. ఇలా చేస్తే ఇడ్లీ, దోసెల్లోకి అదిరిపోతోంది. ఇప్పుడు పోపు కోసం గ్యాస్ మీద మీద పాన్ పెట్టి, దానిలో నూనె వేయాలి.

4 / 5
ఆ తర్వాత ఇది వేడి అయిన   తరవాత ఒక టేబుల్ స్పూన్  ఆవాలు, ఇంకా  జీలకర్ర కూడా వేసి బాగా వేయించాలి.
ఆ  తర్వాత ఎండుమిర్చి  కూడా  వేయించాలి,  ఇంకా దీనిలో  కరివేపాకు కూడా కొద్దిగా వేసి మిక్స్ అయ్యేలా కలపాలి. దీనిలో ఇంగువ  వేస్తే టేస్టీగా ఉంటుంది. మీడియం మంటపైనే వేయించాలి.

ఆ తర్వాత ఇది వేడి అయిన తరవాత ఒక టేబుల్ స్పూన్ ఆవాలు, ఇంకా జీలకర్ర కూడా వేసి బాగా వేయించాలి. ఆ తర్వాత ఎండుమిర్చి కూడా వేయించాలి, ఇంకా దీనిలో కరివేపాకు కూడా కొద్దిగా వేసి మిక్స్ అయ్యేలా కలపాలి. దీనిలో ఇంగువ వేస్తే టేస్టీగా ఉంటుంది. మీడియం మంటపైనే వేయించాలి.

5 / 5
ఈ తాలింపును క్యారెట్,  కొబ్బరి పచ్చడిపై వేసి మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి.  ఆ తర్వాత దీనిని వేడి అన్నంలో తింటే ప్రతి ముద్ద అమృతమే. మీరు చేసేటప్పుడే నోరురిపోతోంది. ఇంకా సువాసనతో అదిరిపోతోంది. మీరు కూడా మీ ఇంట్లో తప్పక ట్రై చేయండి.

Follow Us