
ఇంటిని క్లీన్‌గా ఉంచాలంటే మామూలు విషయం కాదు. అందులోనూ ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే ఇక చెప్పాల్సిన పని లేదు. ఇల్లు పీకి పందిరి వేస్తారు. ఎక్కడ ఉండాల్సిన వస్తువు అక్కడ ఉండదు. కొన్ని రకాల టిప్స్ ఫాలో చేస్తే.. మీ ఇల్లు క్లీన్‌గా ఉంటుంది. పని కూడా చాలా త్వరగా ఫినిష్ అవుతుంది.

ఒక్కోసారి ఫ్యాబ్రిక్స్, కార్పెట్స్ పై ఆయిల్, గ్రీజు మరకలు పడుతూ ఉంటాయి. ఇవి ఒక పట్టాన త్వరగా వదలవు. వీటిని తొలగించుకోవడానికి మొక్క జొన్న పిండి చాలా బాగా ఉపయోగ పడుతుంది. ఇది వాడితే ఆయిల్‌ని పీల్చుకుని మరకలు మాయం అవుతాయి.

చెక్క ఫర్నీచర్ వంటి వాటిపై మచ్చలు పడితే త్వరగా వదలవు. చూడటానికి కూడా చిరాకుగా ఉంటాయి. ఇవి వదలాలంటే.. ఆలివ్ ఆయిల్‌ని లైట్‌గా పాలిష్ అప్లై చేయండి. దీని వల్ల మరకలు పోయి.. షైనీగా మెరుస్తాయి.

ఇంట్లోని దుర్వాసనలు, బ్యాక్టీరియా, వైరస్ వంటి వాటిని దూరం చేసి మంచి సువాసన వెదజల్లాలంటే.. నిమ్మకాయ చాలా బాగా పని చేస్తుంది. ఓ కప్పు నీటిలో నిమ్మ కాయ రసం వేసి.. ఇంటిని, కిచెన్‌ని క్లీన్ చేస్తే సరిపోతుంది.

బాత్ రూమ్‌లోని సబ్బు మరకలు ఒక పట్టాన వదలవు. వాటి కోసం ఎంతో శ్రమించాల్సి ఉంటుంది. కానీ వెనిగర్‌తో ఆ మరకలను తొలగించి.. కొత్త వాటిలా మెరిపించవచ్చు. మరకలు ఉన్న చోట వెనిగర్‌నే వేసి బాగా స్ప్రెడ్ చేయండి. దీని వల్ల మొండి మరకలు త్వరగా వదులుతాయి.