చప్పట్లు కొడితే గుండె జబ్బులు రావా..? అసలు విషయం తెలిస్తే అవాక్కే..

Updated on: Feb 26, 2026 | 6:35 PM

మనం సాధారణంగా సంతోషంగా ఉన్నప్పుడో లేదా ఎవరినైనా అభినందించేటప్పుడో చప్పట్లు కొడతాం. కానీ కేవలం 15 నిమిషాల పాటు చప్పట్లు కొట్టడం వల్ల శరీరంలోని ఎన్నో అనారోగ్య సమస్యలు మటుమాయమవుతాయని మీకు తెలుసా? దీనినే క్లాపింగ్ థెరపీ అంటారు. జిమ్‌లో గంటల తరబడి శ్రమించలేకపోయినా, ఈ చిన్న అలవాటు మీ గుండె ఆరోగ్యాన్ని, రోగనిరోధక శక్తిని అద్భుతంగా మెరుగుపరుస్తుంది. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

1 / 5
మన అరచేతుల్లో దాదాపు 28 ఆక్యుప్రెషర్ పాయింట్లు ఉంటాయి. ఇవి గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీలు వంటి వివిధ అవయవాలతో ముడిపడి ఉంటాయి. మనం గట్టిగా చప్పట్లు కొట్టినప్పుడు, ఈ పాయింట్లు ఉత్తేజితమై ఆయా అవయవాల పనితీరును మెరుగుపరుస్తాయి. దీనివల్ల రక్త ప్రసరణ మెరుగుపడి, రక్త నాళాల్లోని అడ్డంకులు తొలగిపోవడానికి సహాయపడుతుంది.

2 / 5
రోజూ 15-20 నిమిషాల పాటు చప్పట్లు కొట్టడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. మెరుగైన రక్త ప్రసరణ వల్ల గుండెపై ఒత్తిడి తగ్గి, రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. ధమనుల్లో రక్తం గడ్డకట్టకుండా చూడటంలో ఈ చికిత్స అద్భుతంగా పనిచేస్తుంది.

3 / 5
చప్పట్లు కొట్టడం వల్ల శరీరంలో తెల్ల రక్త కణాల ఉత్పత్తి పెరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. దీనివల్ల బాడీ ఇమ్యూనిటీ పెరిగి, వైరల్ ఇన్ఫెక్షన్లు దరిచేరకుండా ఉంటాయి. అంతేకాకుండా ఊపిరితిత్తులకు ఆక్సిజన్ సరఫరా పెరగడం వల్ల ఉబ్బసం, దీర్ఘకాలిక దగ్గు వంటి సమస్యలు తగ్గుతాయి.

4 / 5
మెదడులోని హ్యాపీ హార్మోన్లను ఉత్తేజపరిచే శక్తి చప్పట్లకు ఉంది. ఇది ఆందోళన, ఒత్తిడిని తగ్గించి మనసుకు ప్రశాంతతను ఇస్తుంది. మానసిక ఉల్లాసం కోసం ఉదయాన్నే ఈ థెరపీని చేయడం ఎంతో మేలు.

5 / 5
ఎలా చేయాలి?: రెండు అరచేతులు, వేళ్లు ఒకదానికొకటి పూర్తిగా తగిలేలా గట్టిగా చప్పట్లు కొట్టాలి. ప్రతిరోజూ ఉదయం 10 నుండి 20 నిమిషాల పాటు సాధన చేయడం వల్ల ఉత్తమ ఫలితాలు కనిపిస్తాయి.

Follow Us