
2022 సినీ పరిశ్రమలో ఎన్నో విషాదాలు నెలకొన్నాయి. తమ అభిమాన తారలను కోల్పోయారు ప్రేక్షకులు. ముఖ్యంగా తెలుగులో కృష్ణంరాజు, సూపర్ స్టార్ కృష్ణ మరణాలతో టాలీవుడ్ ఇండస్ట్రీలో మహా శకం ముగిసింది. ఈ ఏడాది మరణించిన సినీ ప్రమఖులు వీళ్లే.

లతా మంగేష్కర్.. కొవిడ్ తోపాటు అనారోగ్య సమస్యలతో ఈ ఏడాది ఫిబ్రవరి 6న బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో కన్నుమూశారు.

బప్పి లహిరి.. అనారోగ్య సమస్యలతో ఈ ఏడాది ఫిబ్రవరి 16న మరణించారు.

సింగర్ కృష్ణకుమార్ కున్నాత్.. గుండె పోటుతో జూన్ 1న మరణించారు.

రాజు శ్రీవాస్తవ.. వ్యాయమం చేస్తుండగా గుండెపోటు రావడంతో సెప్టెంబర్ 21న కన్నుమూశారు.

విక్రమ్ గోఖలే.. అనారోగ్య సమస్యలతో నవంబర్ 26న కన్నుమూశారు.

కృష్ణంరాజు.. అనారోగ్య సమస్యలతో సెప్టెంబర్ 11న తుదిశ్వాస విడిచారు.

ఇందిరా దేవి. మహేష్ బాబు తల్లి సెప్టెంబర్ 28న కన్నుమూశారు.

సూపర్ స్టార్ కృష్ణ.. మహేష్ బాబు తండ్రి గుండెపోటుతో నవంబర్ 15న మరణించారు.