Telugu Movies: కోల్పోయిన నెంబర్ వన్ స్థానం 2024లో తెలుగు ఇండస్ట్రీ సొంతం చేసుకుంటుందా..?

| Edited By: Prudvi Battula

Jan 03, 2024 | 12:28 PM

2023 అయిపోయింది.. కొత్త కేలండర్ మొదలైంది.. ఇప్పుడు ఆలోచనలన్నీ న్యూ ఇయర్‌పైనే ఉండాలి.. మరి ఈ ఏడాది ఎలా ఉండబోతుంది..? టాలీవుడ్ జాతకం మారబోతుందా..? 2023 బాలీవుడ్ మళ్లీ అప్పర్ హ్యాండ్ సాధించింది. మరి కోల్పోయిన నెంబర్ వన్ స్థానం 2024లో తెలుగు ఇండస్ట్రీ సొంతం చేసుకుంటుందా..? కొత్త ఏడాదిపై కవర్ స్టోరీ ఈ రోజు ఎక్స్‌క్లూజివ్‌లో చూద్దాం..

1 / 5
2023లో అల్లు అర్జున్, రామ్ చరణ్, మహేష్, ఎన్టీఆర్ లాంటి హీరోలు రాలేదు. దాంతో వాళ్ల చూపు 2024పైనే ఉంది. సంక్రాంతికే గుంటూరు కారంతో మహేష్ వచ్చేస్తున్నారు.. అలాగే 2023 మిస్సైన నాగార్జున, వెంకటేష్ కూడా పండక్కే నా సామిరంగా, సైంధవ్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చేస్తున్నారు.

2 / 5
2024లోనూ ప్రభాస్ హవానే ఎక్కువగా కనిపించబోతుంది. ప్రభాస్ ప్రాజెక్ట్ కే పాన్ వరల్డ్ సినిమాగా రాబోతుంది. నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ కేతో పాటు మారుతి సినిమా, సలార్ 2 సైతం 2024లోనే వచ్చే ఛాన్స్ ఉంది. కనీసం అందులో రెండైనా ఈ ఏడాది రానున్నాయి.

3 / 5
ఇక ఎప్రిల్ 5న జూనియర్ ఎన్టీఆర్ దేవర మొదటి భాగంతో దండయాత్రకు వస్తున్నారు. ఆగస్ట్ 15న పుష్ప 2, సెప్టెంబర్‌లో గేమ్ ఛేంజర్ రానున్నాయి. వీటి రాకలో ఎలాంటి అనుమానాలు అవసరం లేదు.

4 / 5
ఇవి మాత్రమే కాదు.. 2024లో పవన్ కళ్యాణ్ నుంచి కూడా రెండు సినిమాలు వచ్చే చాన్స్ లేకపోలేదు. ఓజితో పవన్ పాన్ ఇండియన్ ఎంట్రీ ఇస్తున్నారు. 2 భాగాలుగా సుజీత్ దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఎన్నికల తర్వాత ఈయన ఓజితో పాటు ఉస్తాద్ భగత్ సింగ్ కూడా విడుదల కానున్నాయి. ఇందులో ఓజి షూట్ చివరి దశకు రాగా.. ఉస్తాద్ 30 శాతం పూర్తైంది. 

5 / 5
ఇక బాలయ్య బాబీ సినిమా కూడా 2024లోనే రాబోతుంది. ఈ సినిమాపై మామూలు క్రేజ్ లేదు. చిరంజీవి, వశిష్ష సినిమా 2025లో రానుంది.. కానీ 2024లో అనిల్ రావిపూడితో సినిమా చేయబోతున్నారు మెగాస్టార్. ఇవన్నీ కానీ అంచనాలు అందుకుంటే 2024లో టాలీవుడ్ జెండా బాలీవుడ్‌లో మళ్లీ ఎగరడం ఖాయం.